suspicious death in chandanagar వివాహిత హత్య.. అమె తల్లి, కూతరు కూడా..

Suspicious death in chandanagar husband absconding

cyberabad police, Wife Illegal Affairs, Husband Illegal Affair, cyderabad Police, Family Disputes, Wife Husband Relationship, 3 family members suspicious death, aparna murder, vijayalakshmi, karthikeyini, suspicious murders, chandanagar murders, crime

Three members of a family were lying dead in thier rented house in suspicious manner, the deceased were aparna her mother vijaya lakshmi and her four years old daughter.

చందానగర్లో దారుణం.. వివాహిత హత్య.. అమె తల్లి, కూతరు కూడా..

Posted: 01/29/2018 03:37 PM IST
Suspicious death in chandanagar husband absconding

చందానగర్లో మరో దారుణం జరిగింది. ఓ వివాహితను అత్యంత దారుణంగా హతమార్చారు గుర్తుతెలియని దుండగులు. అమెతో పాటు అదే నివాసంలో వుండే అమె తల్లితో పాటు నాలుగేళ్ల చిన్నారిని పట్ల కూడా కనీస కనికరం లేకుండా చంపేశారు. వివాహిత రక్తపు మడుగులో పడివుండగా, అమె తల్లి, కూతురు మాత్రం మంచంపై పడుకుని వున్నారు. వారికి విషమిచ్చి చంపేశారా..? లేక ఎలా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త స్థానికంగా కలకలం రేపుతుంది.

స్థానికంగా గల ఓ అపార్ట్‌మెంట్‌లో  మృతులు అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కుమార్తె నాలుగేళ్ల చిన్నారి కార్తికేయినిలు విగతజీవులుగా పడివున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు పిర్యాుదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా అమె భర్తకు దూరంగా వుంటుందని.. అతనే ఈ దారుణానికి ఒడిగట్టి వుండాటని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరా్ల్లోకి వెళ్తే.. గోదావరి జిల్లా బీమవరానికి చెందిన అపర్ణ..  చందానగర్ కు వలసవచ్చి.. ఓ ఎలక్ట్రానిక్‌ షోరూమ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అమెతో పాటు అమె తల్లి కూడా వుంటుంది. కాగా, అమెకు గత అరేళ్ల క్రితం కేపీహెచ్‌బీ కాలనీలో ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న మధు అనే యువకుడితో పరిచమయమైంది. ఇది వారిద్దరి వివాహానికి దారితీసింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి కార్తీకేయిని అనే కూతురు కూడా వుంది.

కాగా, మధుకు అప్పటికే మరో వివాహితుడన్న విషయాన్ని దాచిపెట్టి అపర్ణను పెళ్లి చేసుకున్నాడు. తన భర్త మరో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న మధు మొదటి భార్య అపర్ణ ఇంటికి వచ్చి పలుమార్లు గొడవకు దిగింది. ఈ క్రమంలో ఇటు అపర్ణకు మధుకు మధ్య కూడా గత కొంతకాలంగా విభేదాలు తలెత్తడంతో ఇరువురూ వేర్వేరుగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హత్యలు దారితీయడంతో మధుపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suspicious murders  chandanagar  cyberabad police  crime  

Other Articles