Schoolgirl's wedding video goes viral బాలిక మెడలో తాళికట్టిన విద్యార్థి.. తరగతి గదిలోనే తంతు..

Schoolgirl s wedding video goes viral shocks people

minor marriage, teachers association, cyber crime, child rights activists, marriage in classroom, school uniform, government school, Chennai News, Tamil Nadu News, India News, Latest News

The video of a boy tying the ‘thaali’ to a girl, wearing a school uniform, is doing the rounds on social media, raising the question if it was a minor marriage.

బాలిక మెడలో తాళికట్టిన విద్యార్థి.. తరగతి గదిలోనే తంతు..

Posted: 01/05/2018 08:26 AM IST
Schoolgirl s wedding video goes viral shocks people

మ్యారేజెస్ అర్ మేడ్ ఇన్ హెవన్ అంటూ అంగ్లంలో చెప్పినా.. ఎవరికెవరు అన్నది ఎక్కడో వున్నవాడు రాసిపెడతాడు అని తెలుగులో చెప్పినా.. పది మంది బందుమిత్రుల మధ్య మేళతాళాల మధ్య, వేద మంత్రాల నడుమ, అహ్లాదకర వాతావరణంలో జరుపుకునేదే పెళ్లి. కష్టాలు, కన్నీళ్లు, దిగమించుకుని అనందబాష్పాలతో అమ్మాయి కల్యాణం జరిపిస్తారు కన్నవాళ్లు. అయితే మారుతున్న కాలంలో ఇలాంటి తంతులేమి లేకుండా మమ అనిపించేలా ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి.

అయితే పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు, ప్రేమ వివాహాలు కాకుండా ఈ మధ్య సినిమాల్లో చూపిస్తున్న విధంగా కూడా కల్యాణాలు జరిగిపోతున్నాయి. ఆదెలా అంటారా.. యువతిపై కక్షతో లేక బాలిక తల్లిదండ్రులపై పగతోనే ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారు. తాజాగా, తరగతి గదిలోనే ఓ విద్యార్థి, మరో విద్యార్థిని మెడలో తాళికట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఉన్న సంభాషణను బట్టి ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తోంది. బాలిక మెడలో బాలుడు తాళి కడుతున్నప్పుడు తోటి విద్యార్థులు సహా బాలుడి తల్లి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాద్యమంలో పెట్టింది కూడా బాలిక తల్లే అన్న అనుమానిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా తరగతి గదిలోని మాస్టార్లు వారి చర్యలకు ఎలాంటి అభ్యర్థన చెప్పకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా తాళికట్టిన బాలుడి తల్లి బహుశా టీచరై ఉండవచ్చని అంటున్నారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల  సంరక్షణ  సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ బాలజంట కోసం గాలిస్తున్నారు.

ఈ వీడియో మొత్తం 29 సెకన్లు ఉంది. చేతిలో తాళి పట్టుకుని నిల్చున్న బాలుడు ‘అమ్మా..’ అంటూ ఆమె ఆదేశం కోసం చూడడం స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే ‘తాళి కట్టరా..’ అంటూ మహిళ తమిళంలో చెప్పడం వినిపించింది. తల్లి ఆదేశంతో యూనిఫాంలో ఉన్న బాలిక మెడలో బాలుడు తాళికట్టాడు.  ఆ సమయంలో తరగతి గదిలో మరికొంత మంది విద్యార్థులు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంటే క్లాసు జరుగుతుండగానే ఈ తంతు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor marriage  child rights activists  marriage in classroom  Chennai News  Tamil Nadu  

Other Articles