Tv anchor pradeep apologizes పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు

Tv anchor pradeep says he is abide to law in drunk and drive case

drunk and drive, police check operations, Anchor Pradeep, Pradeep, case, new year celebrations, crime, pradeep machiraju, begumpet traffic police station, hyderabad, TV anchors, telugu News, India News, Latest News

Tv anchor pradeep apologizes and gives call to his fans, never any one should commit the same mistake as him, and tell he is abide to law in drunk and drive case.

ITEMVIDEOS: శభాష్ ప్రదీప్.. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు

Posted: 01/05/2018 09:05 AM IST
Tv anchor pradeep says he is abide to law in drunk and drive case

ప్రముఖ టీవీ యాంకర్.. ఎంతో మంది యువతులకు అభిమాన యాంకర్ గా మారిన ప్రదీప్ మాచిరాజు.. గతంలో తాను చెప్పిన మంచి విషయాలను మరచి.. డిసెంబరు 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోవడంతో ఆయనను అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో నెట్ జనులు విపరీతంగా అడేసుకున్నారు. అయితే వాటిన్నంటినీ పట్టించుకోని ప్రదీప్.. మరోమారు కూడా తన పంథా అదేనని, అయితే న్యూఇయర్ రోజున అలా చేసివుండవలసింది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

తాను తప్పు చేశానని, ఇలా మరెవరూ చేయవద్దంటూ కోరుతూ.. ఓ వీడియో పోస్టు సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతుంది. శభాష్ ప్రదీప్.. పశ్చాతాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని పలువురు పలురకాల కామెంట్లు కూడా పోస్టు చేస్తున్నారు, తప్పులు చేయడం మానవ సహజం కానీ.. చేసిన తప్పులను సరిదిద్దుకోవడమే మంచి వారి ఉన్నత, ఉత్తమ గుణమని కూడా కామెంట్లు వస్తున్నాయి. పోలీసుల కౌన్సెలింగ్‌కు తాను ఎందుకు హాజరు కాలేకపోయిందీ అందులో పేర్కొన్నాడు.

తాను చట్టానికి నిబద్దుడనై వ్యవహరిస్తానని, చట్టాన్ని తీసుకునే చర్యలకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పాడు. పోలీసుల కౌన్సెలింగ్‌కు కానీ, దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు కానీ హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే తాను కౌన్సిలింగ్ కు హాజరు కాలేకపోయానని చెప్పారు. అంతేకానీ ఈ విషయంలో మరో కారణాలు ఏమీ లేవన్నారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రదీప్ పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ లోగా ఈ వీడియో‌ను పోస్టు చేసిన ప్రదీప్ తాను పరారీలో లేనని, త్వరలోనే పోలీసుల ఎదుట హాజరు అవుతానంటూ అందులో పేర్కొనడం గమనార్హం. కాగా, తాగి డ్రైవ్ చేయడంతోపాటు అతడి వాహనం అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆర్టీఐ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk and drive  police check  concelling  Anchor Pradeep  Pradeep  case  new year celebrations  crime  

Other Articles