Cut sales tax or VAT on petrol and diesel ఇంధన ధరలపై రాష్ట్రాలకు కేంద్రం అభ్యర్థన..

Cut sales tax or vat on petrol and diesel center to states

dharmendra pradhan, Petrol, diesel, vat, sales tax, oil ministry, states

Oil Minister Dharmendra Pradhan called upon states to cut sales tax or VAT on petrol and diesel to provide relief to consumers.

ఇంధన ధరలపై రాష్ట్రాలకు కేంద్రం అభ్యర్థన.. వింటారా.?

Posted: 12/29/2017 06:25 PM IST
Cut sales tax or vat on petrol and diesel center to states

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఇటీవలే ముగిసిన గుజరాత్ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలు.. క్రమంగా పెరుగుతూ రూ.80కి లీటర్ వరకు చేరాయి. ఇక డీజిల్ పై కూడా రాయితీని క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కేంద్రం ధరలను తగ్గించే పనుల్లో పడింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.

వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ఆయిల్‌ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ''పలు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి. మరోసారి మేము అభ్యర్థిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో వ్యాట్ ను కలిగి ఉన్న రాష్ట్రాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లను తగ్గించాలి'' అని మంత్రి చెప్పారు. అంతేకాక పెట్రోలియం రంగాన్ని గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపారు.

అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇటీవల విపరీతంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పెంపుదలను నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. లీటరు పెట్రోల్‌కు 21.48గా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని రూ.19.48కు తీసుకొచ్చింది. అదేవిధంగా డీజిల్‌పై రూ.17.33గా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని రూ.15.33కు కుదించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని, అన్ని రాష్ట్రాలు వ్యాట్‌ల్లో కోత పెట్టాలని కేంద్రం అంతకముందే ఆదేశించిన సంగతి తెలిసిందే.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dharmendra pradhan  Petrol  diesel  vat  sales tax  oil ministry  states  

Other Articles