Yet Another Ultimatum From Mudragada! కాపు రిజర్వేషన్ల అంశంలో ముద్రగడ మరో డెడ్ లైన్

Mudragada s new deadline to chandrababu

Chandrababu Naidu, Kapu Reservation, Mudragada Padmanabham, Mudragada new deadlina, Mudragada jagan, Mudragada chandrababu, Mudragada kapus, Andhra Pradesh

Kapu Strongman Mudragada Padmanabham set yet another deadline for AP CM Chandrababu. After Kapu JAC Meeting in Kirlampudi, Mudragada went on to say that Reservations should come into force by March 31st, 2018.

కాపు రిజర్వేషన్ల అంశంలో ముద్రగడ మరో డెడ్ లైన్

Posted: 12/12/2017 07:42 PM IST
Mudragada s new deadline to chandrababu

కాపులను బీసీల్లో చేర్చి 5శాతం రిజర్వేషన్లు కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకేశారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో కాపు జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పద్మనాభం మాట్లాడుతూ... చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని నమ్ముదాం అన్నారు. అలాగే మోసం చేస్తే మనమూ మోసం చేద్దాం అని పిలుపునిచ్చారు. పూర్తిస్థాయి రిజర్వేషన్ల సాధనకు కాపు యువత సిద్ధంగా ఉండాలన్నారు.  

అయితే కాపు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించినపుడే కాపులకు నిజమైన పండుగ అని ఆయన అన్నారు. ఆ లెక్కన 10 నుంచి 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కాపు, బలిజ, ఒంటరి కులాలు ఏకతాటి పైకి రావాలని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల్లో నెలకొన్న అపోహలను ప్రభుత్వమే తొలగించాలని ముద్రగడ అన్నారు. కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని, అప్పటికీ కాపు రిజర్వేషన్లు అమలు కాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.

'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది నా ఆశ. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందాలంటే రిజర్వేషన్నది కచ్చితంగా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గించకూడదని మనవి చేస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది ప్రధాన డిమాండ్. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదు. ఉద్యోగ, ఇతర రంగాలతో పాటు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలి. అలా జరిగితే అందరికీ సమాన అవకాశాలుంటాయని' కాపు నేత ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Kapu Reservation  Mudragada Padmanabham  new deadlina  kapus  Andhra Pradesh  

Other Articles