Bomber mocked Trump online hours before Manhattan Attack | బాంబు పేలుడుకు ముందు ఆ ఉగ్రవాది ట్రంప్ గురించి ఏమన్నాడో తెలుసా?

Bomber mocked trump before subway attack

New York, Manhattan Subway Blast, US Bomb Blast, Donald Trump, Akayed Ullah, Manhattan Subway Bomb Blast

New York Manhattan Subway Bomb Suspect Said Trump "Failed To Protect" US On Facebook Before The Attack. Akayed Ullah, 27, was accused of detonating a pipe bomb strapped to his body in an underground passageway between Times Square — the city’s busiest subway station — and the bustling Port Authority Bus Terminal.

ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు

Posted: 12/13/2017 10:10 AM IST
Bomber mocked trump before subway attack

మాన్ హటన్ సబ్ వే స్టేషన్ వద్ద పైప్ బాంబు పేలుడు అమెరికాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాంబును పేల్చడంలో విఫలమైన అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, బంగ్లాదేశ్ పౌరుడు అకయ్యద్ ఉల్లాహ్ (27) తన ఉద్దేశం ఏంటో వివరిస్తూ ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును కూడా ఉంచాడన్న విషయం దర్యాప్తులో వెల్లడైంది.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిని రక్షించడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపిస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో బాంబు పేల్చడానికి ముందు ఓ వ్యాఖ్యను పెట్టాడు. ఇక తన ఇంటిలో అమెరికాకు వ్యతిరేకంగా ఉల్లాహ్ పలు వ్యాఖ్యలను స్వదస్తూరితో గోడలపై రాశాడని కూడా పేర్కొంది.

ఈ బాంబును పేల్చడంలో ఉల్లాహ్ విఫలం కావడంతో, ప్రమాద తీవ్రత తగ్గి, అతి కొద్ది మందికి మాత్రమే గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో ఉల్లాహ్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉల్లాహ్ తమ ఫేస్ బుక్ పేజీలో ఐఎస్ఐఎస్ పేరు ప్రస్తావిస్తూ, వారు చేసే దాడులకు తాను మద్దతిస్తానని కూడా రాసినట్టు 'ది డైలీ బీస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles