ACB manager leaks dept confidential information ఇంటిదొంగ గుట్టు రట్టు.. వేటు వేసిన అధికారులు

Acb manager suspended for leaking dept confidential information

shoban babu, ACB secrecy manager, anti corruption bureau, acb director general, ips thakur, raids information leak, ACB Raids, suspension

ACB manager shoban babu suspended for leaking department confidential information to the officials of andhra pradesh

అవినీతి నిరోధక శాఖలో.. అవినీతి అధికారి.. ఇంటిదొంగే..

Posted: 12/05/2017 12:56 PM IST
Acb manager suspended for leaking dept confidential information

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న పాత నానుడిని బాగా వంట పట్టించుకున్న ఓ అధికారి తాను కూడా ఇలాంటి పనులే చేసినా దొరకబోనని అనుకున్నాడు. అంతే తాను ఉన్న.. ఉద్యోగం నిర్వహిస్తున్న శాఖకే వెన్నుపోటు పొడిచి.. కంచె చేను మేసిన తరహాలో అవినీతికి పాల్పడ్డాడు. అవినీతి పరులకు ఈ శాఖ పేరు చెబితేనే సింహస్వప్నం. కానీ అలాంటి శాఖలో ఓ అవినీతిపరుడు తన అవినీతిని పెంచుకునేందుకు వినియోగించుకున్నాడు.

అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూనే.. తమ విభాగం (ఏసీబీ) అధికారులు జరిపే దాడులకు సంబంధించిన సమాచారాన్ని అవినీతి అధికారులకు ముందుగానే చేరవేసి వారి నుంచి తాయిలాలను అందుకున్నాడు. దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన అవినీతిపరులు తమ వద్దనున్న అక్రమ సంపద, అందుకు సంబంధించిన పత్రాలను వెనువెంటనే తమ బంధువుల ఇళ్లకో లేక స్నేహితుల ఇళ్లకో పంపించే అవకాశం కల్పించాడు. అవినీతి అధికారులు పక్కగా ప్లాన్ చేసిన అకస్మిక దాడులు జరిపినా.. అవినీతిపరులైన అధికారుల వద్ద ఎలాంటి అక్రమసోత్తు లభ్యం కాకపోవడంతో.. ఖంగుతిన్న అధికారులు షాక్ కు గురయ్యారు.

తమ దాడుల సమాచారం ముందుగానే అందుకోవడంతోనే అవినీతి అధికారులు అలెర్ట్ అవుతున్నారని గ్రహించారు. దీంతో తమ శాఖలోనే ఇందుకు సంబంధించిన అధికారులు వున్నారని గ్రహించిన అధికారులు.. ఓ ప్రణాళికా బద్దంగా ఇంటిదొంగను పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిపై దాడి జరుపుతున్నట్లు సమాచారంతో అప్రమత్తం కావడంతో ఆ విభాగానికి చెందిన అధికారి నుంచి అతనికి కాల్ వెళ్లింది. దీంతో అధికారి డ్రామా ముగిసింది. అతనే ఏసీబీ రహస్య విభాగం మేనేజర్‌ శోభన్ బాబు. దీంతో ఏసీబీ డీజీ ఠాకూర్‌  సదరు అధికారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అవినీతి అధికారులతో శోభన్ బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందవేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. 50మందికి పైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్ డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్ బాబుపై శాఖపరమైన విచారణకు ఠాకూర్‌ ఆదేశించారు. కాల్ డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. సమాచారం లీక్ చేయడంతో పాటు మరేదైనా అక్రమాలకు పాల్పడ్డడా..? అన్న కోణంలోనూ అధికారులు అతనిపై విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles