Sreenidhi school again punishes students శ్రీనిధి స్కూలు: తప్పుతెలుసుకోదు.. తీరు మార్చుకోదు

Evenafter dy cm probe orders sreenidhi school punishes students

Dy CM, Kadiam Srihari, school management, Sreenidhi International School, principal Bruce Ferguson, 7th class student, Chetan Chowdhary, mental agony, Moinabad Police Station, rangareddy district, telangana, crime

Evenafter Dy CM probe orders, and a police case against Sreenidhi International School, principal Bruce Ferguson and teachers never change thier attitude towards students and warns them to take back the written complaint.

శ్రీనిధి పాఠశాల తీరు దారుణం.. విద్యార్థులకు పక్షం రోజులుగా నరకం

Posted: 12/05/2017 02:00 PM IST
Evenafter dy cm probe orders sreenidhi school punishes students

కార్పోరేట్ అస్పత్రులు రోగుల జీవితాలతో అటలాడుకుని వారి నుంచి అందినకాడికి డబ్బును వసూలు చేస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చిన ఇటీవలి కాలంలో.. తాజాగా కార్పోరేట్ పాఠశాలు కూడా మేమేమన్నా తక్కువ తిన్నామా అన్న రీతిగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలపై పోలీసులకు పిర్యాదు చేసినందుకు దానిన వెంటనే ఉపసంహిరించుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్న పాఠశాల యాజమాన్యం అమాయక విద్యార్థులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. గత రెండు వారాలుగా ఆయా విద్యార్థులకు తరగతులకు హాజరుకానీయని యాజమాన్యం.. అఫీసు గదిలోనే కూర్చోబెడుతుంది.

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాల.. పోలీసు పిర్యాదు చేసినందుకు గత రెండు వారాలుగా వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. బాధిత విద్యార్థితో పాటు అతని సోదరిపై తరగతులు బహిష్కరణ శిక్షను వేసిన యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. పోలీసు పిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదరింపులకు పాల్పడుతోంది. విద్యార్థులను మాసనిక వేదనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో బాలల హక్కుల వేదిక సభ్యులు జోక్యం చేసుకుని పాఠశాల యాజమాన్యాన్ని సర్థుకుపోవాలని చెప్పడంతో.. తాము సర్థుకుపోతున్నామని చెప్పిన యాజమాన్యం తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పిల్లలపై ప్రతీకారం తీర్చుకుంటున్న కార్పోరేట్ పాఠశాలగా ఇప్పటికే రికార్డుకెక్కింది.

అసలేం జరిగిందంటే.. మదీనాగూడకు చెందిన చేతన్ చౌదరి(12) మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో ఉన్న శ్రీనిధి ఇంటర్నేషనల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్30న చేతన్‌ కాలివేళ్లకు దెబ్బతగలడంతో షూ వేసుకోకుండా స్కూల్ కు వెళ్లాడు. షూ వేసుకురాలేదంటూ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తరగతి గదిలోకి వెళ్లనియ్యకుండా బయట కూర్చోబెట్టారు. ఇలా రెండు రోజులపాటు బయట కూర్చోబెట్టడంతో విద్యార్థి మానసిక వేదనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అడుగగా.. తమ పాఠశాలలో అలాంటి శిక్షలే ఉంటాయని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.

దీంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ తరువాత తమ పిల్లాడు  చేతన్  పాఠశాలకు వెళ్లినా.. తోటి విద్యార్థులందరూ హేళన చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, పిర్యాదులో పేర్కోన్నారు. ఇక పాఠశాలలో జరిగిన విషయాలను వెంటనే వెళ్లి తల్లిదండ్రులకు చెబుతారా.. నీకు ఇంకా శిక్ష వేయాలని తరగతి గదిలోకి వెళ్లనివ్వకుండా బయట కూర్చోబెట్టారని కూడా తల్లిదండ్రులు తమ పిర్యాదులో పేర్కోన్నారు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సునీత తెలిపారు. మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి వాణి డిమాండ్ చేస్తున్నారు.

అంతటితో అగకుండా విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. ఈ విషయమై స్వయంగా తెలంగాణ ఢిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా శ్రీనిధి పాఠశాల యాజమాన్యంపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో కూడా విచారణ జరిపించి.. తనకు నివేదిక సమర్పించాలని అయన అదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు.. విద్యార్థులను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు.. వేధించవద్దని ఆదేశించారు. దీంతో తమ విద్యాసంస్థకు వున్న పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా మటుమాయమయ్యాయని భావించిన పాఠశాల యాజమాన్యం ఇప్పటికీ తప్పు తెలుసుకోకుండా సైకో మాదిరిగా.. అభం శుభం తెలియాని చిన్నారులపై ప్రతీకారం తీర్చుకుంటూనే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles