3 killed, 9 injured in train derailment in Uttar Pradesh పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ ప్రెస్..

Vasco da gama patna express derails near up s manikpur at least 3 killed 9 injured

Banda, UP train derailment, Vasco Da Gama-Patna, Vasco Da Gama-Patna Express, Vasco Da Gama-Patna Express dearails, Vasco Da Gama-Patna Express train accident, Vasco Da Gama-Patna train accident, Vasco da Gama‬, ‪Banda district, ‪Chitrakoot district‬, ‪Manikpur‬, ‪Patna‬, ‪Uttar Pradesh‬

Three persons died and nine were injured on Friday as 13 coaches of Vasco Da Gama Patna Express train derailed near Manikpur in Uttar Pradesh at 4:18 am.

పట్టాలు తప్పిన వాస్కోడిగామా-పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు..

Posted: 11/24/2017 09:03 AM IST
Vasco da gama patna express derails near up s manikpur at least 3 killed 9 injured

ఉత్తర్ ప్రదేశ్ లో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున వాస్కోడిగామా-పట్నా ఎక్స్ ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జిల్లాలో మానిక్ పురి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో  రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రమాణికులు మృతిచెందగా.. 9 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. వారికి నష్ణపరిహారంగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారాన్ని అందిస్తామన్నారు. ఘటనపై చిత్రకూట్ ఎస్సీ గోపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో బీహార్ బెట్టయ్య జిల్లాకు చెందిన తండ్రి, కొడుకులు ఘటనాస్థలంలోనే మరణించారని, కాగా, మరో వ్యక్తం అస్పత్రికి తరలిస్తుండగా మరణంచారని చెప్పారు.

గాయపడిన తొమ్మిది మందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డగా, వారిని చిత్రకూట్ జిల్లా అస్సత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. మిగిలిన ఏడుగురికి స్వల్పగాయాలు అయ్యాయని అన్నారు. చిత్రకూట్ జిల్లాలోని మానిక్ పూరి రైల్వే స్టేషన్ రెండో నెంబరు ఫ్టాట్ ఫాం వదిలివెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని సుమారుగా నాలుగు గంటల 18 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఎస్సీ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasco Da Gama-Patna Express  derail  ‪Banda district  chitrakoot  uttar pradesh  

Other Articles