EPFO to credit ETF units to PF accounts of subscribers పీఎఫ్ నిధులను అలా మళ్లిస్తే.. ఇలా లాభాలు

Epf body approves proposal to credit exchange traded fund units to pf accounts

Employees' Provident Fund Organisation,EPFO,Exchange traded fund, traded fund,traded fund units,provident fund body,Labour Minister Santosh Gangwar,Central Board of Trustee, National Payments Corporation of India

The retirement fund body, EPFO, on Thursday approved a proposal for crediting exchange traded fund (ETF) units to provident fund accounts of its 4.5 crore members.

పీఎఫ్ నిధులను అలా మళ్లిస్తే.. ఇలా లాభాలు

Posted: 11/24/2017 09:53 AM IST
Epf body approves proposal to credit exchange traded fund units to pf accounts

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు శుభవార్త. ఇకపై ఫీఎఫ్ చందదారుల ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్‌’ (ఈటీఎఫ్‌)లను జమ చేయాలని ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్ వో) నిర్ణయించింది. అయితే ఇది అందరికీ కాదండోయ్. కేవలం తమ ఖాతాలోని డబ్బులను ఎక్చేంజీ ద్వారా వ్యాపారం చేసిన వారికి మాత్రమేనని సమాచారం. దీంతో ఇక రానున్న మార్చి మాసాంతానికి చందాదారులు తమ ఖాతాలకు ఎన్ని ఈటీఎఫ్ యూనిట్లు వచ్చాయో చూసుకోగల వీలుంటుంది. ఈ మేరకు ఐఐఎంతో చర్చించిన మీదట ఈక్విటీ సాధనాల విలువ లెక్కింపు, చందాదారులకు వాటిని బదలాయించడంపై ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకొంది.

ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. కాగ్‌ చేసిన పరిశీలనను కూడా గణాంక విధానంలో చేర్చినట్లు చెప్పారు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) ద్వారా కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థను అమలు చేసే ప్రతిపాదననూ ఆమోదించామని తెలిపారు. ప్రస్తుత విధానంలో లావాదేవీ రుసుములు ఎక్కువగా ఉండడమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎన్పీసీఐ ద్వారా జరిగే లావాదేవీలు అదేరోజు పూర్తవుతాయని చెప్పారు.

తమ సొమ్ము నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడు, లేదా తమ ఖాతాను పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు చందాదారుల ఈపీఎఫ్‌వో... వారి ఈటీఎఫ్‌ యూనిట్లను నగదుగా మారుస్తుందని కార్మికశాఖ కార్యదర్శి ఎం.సత్యవతి తెలిపారు. ఈ యూనిట్లతో చందాదారులు నేరుగా ట్రేడింగ్‌ చేయలేరనీ, ఇందుకు సమ్మతిస్తూ వారి ధరఖాస్తు అందిన క్రమంలో కేంద్రీయ సంస్థే వాటిని నగదుగా మారుస్తుందనీ వివరించారు. 2015 ఆగస్టు నుంచి ప్రారంభమైన ఈటీఎఫ్ నిధుల్ని మదుపు ప్రక్రియలో ఇప్పటివరకు రూ.32 వేల కోట్లను జమ అయ్యిందని, వీటిపై 21.87% చొప్పున ప్రతిఫలం లభించిందని సత్యవతి అంచనా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles