Rahul can't be termed as pappu రాహుల్ గాంధీని అలా సంబోధిస్తే ఇకపై...

Gujarat ec blocks bjp poll ad mentioning pappu

Gujarat elections, Pappu, BJP Gujarat ad, Pappu ad, Election Commission, Rahul Gandhi, Pappu video, BJP, derogatory, Pappu, Rahul Gandhi, Politics

A massive political controversy broke out after the Gujarat Election Commission (EC) opposed to a Bharatiya Janata Party’s poll campaign TV advertisement, featuring an individual named ‘Pappu’.

రాహుల్ గాంధీని అలా సంబోధిస్తే ఇకపై...

Posted: 11/15/2017 10:55 AM IST
Gujarat ec blocks bjp poll ad mentioning pappu

సుమారుగా రెండు దశాబ్దాల బీజేపి పార్టీ పాలనను చూసిచూసి విరక్తి చెందుతున్న గుజరాత్ వాసులు ఈ సారి బాహాటంగానే ప్రత్యమ్నాయ కాంగ్రెస్ పార్టీకి మద్దుతు ఇవ్వాలని నిర్శచకున్నట్లుగా వున్నారు. ఇప్పటికే గుజురాత్ లోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన యువనాయకులు కూడా కాంగ్రెస్ కు మద్దుతు తెలుపడంతో. ఈ సారి ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారంలో వున్న బీజేపి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయనను పప్పు అని సంబోధించే విధంగా ప్రచారం చేసి.. వ్యతిరేక ప్రచారంతో తాము ముందుకెళ్లాలని ప్రణాళికలు రచించింది.

అయితే ఈ ప్రచారాలపై ఎన్నికల కమీషన్ కొరడా ఝళిపించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన అగ్రనేతను పప్పు అంటూ సంబోధించడం సముచితం కాదని, ఇలా చేయడం అయనను అవమానించడమేనని మండిపడింది. అంతేకాదు ఇకపై ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని కూడా అదేశించింది. దీనిపై తీవ్రవ్యతిరేకతను ప్రదర్శించినా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈసీ అదేశాలను పాటించక తప్పలేదు బీజేపికి. రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో ‘పప్పు’ అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ నిషేధించింది.

స్క్రిప్టును పరిశీలించిన కమిషన్‌కు చెందిన కమిటీ ‘పప్పు’   అనే పిలుపు అభ్యంతకరంగా ఉందని చెప్పింది. ఓ నాయకుడిని అలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై స్పందించిన గుజరాత్‌ బీజేపీ శ్రేణులు అడ్వర్టైస్‌మెంట్‌లో వినియోగించిన స్క్రిప్ట్‌ ఏ నాయకుడిని ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి. ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన స్క్రిప్టును ముందుగానే గుజరాత్‌ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉండే మీడియా కమిటీకి అందజేస్తామని తెలిపాయి. అలా స్క్రిప్టును పరిశీలించిన కమిటీ సభ్యులు ‘పప్పు’  అనే పదాన్ని తొలగించాలని కోరినట్లు వెల్లడించాయి. త్వరలోనే సరికొత్త స్క్రిప్టును ఈసీకి అందజేస్తామని తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat elections  Pappu  BJP Gujarat ad  Pappu ad  Election Commission  Rahul Gandhi  Pappu video  

Other Articles