US: Four killed in California shooting spree అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం..

California gunman tried to access classrooms to kill children

shooting in United States, Gun violence in america, shooting in elementary school, shooting in Rancho Tehama, shooting in california, Phil Johnston, Tehama County, northern California, Domestic violence

The gunman who killed four people and wounded at least 10 others, including two children, in Northern California, who tried to access rooms at an elementary school to shoot more kids as part of a "bizarre and murderous rampage.

ITEMVIDEOS: అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం..

Posted: 11/15/2017 10:11 AM IST
California gunman tried to access classrooms to kill children

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. గత అర్థారత్రి జరిగిన కాల్పుల కలకలం పలు చోట్ల వినిపించినా.. ఓ స్థానిక పాఠశాలలోకి వెళ్లేందుకు కూడా దుండగలు యత్నించారన్న వార్తతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా భీతిల్లిపోయారు. భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ప్రాంతంలో పలు చోట్ల సాయుధుడైన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

చివరకు స్థానికంగా వున్న ఎలిమెంటరీ స్కూల్ లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా యత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకున్న నలుగురు పాఠశా సిబ్బందిని హతమార్చిన అగంతకుడు.. సుమారు పది మందిని గాయపర్చాడు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా వున్నట్లు సమాచారం. అమెరికాలోని రాంచో టెహామా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కాలిఫోర్నియాలోని రెడ్ బ్లఫ్ గ్రామీణ ప్రాంతంలోని రాంచో టెహామా ప్రాంతంలో ఓ సాయుధుడైన అగంతకుడు కాల్పులతో చెలరేగిపోయాడని సమాచారం అందుకున్నామన్నారు.

అయితే పలు చోట్ల తన చేతిలోని సెమీ ఆటోమెటిక్ గన్, రెండు హ్యాండ్ గన్ కాల్పులు జరిపిన అగంతకుడు..చివరకు ఏకంగా స్థానికంగా వున్న ఎలిమెంటరీ పాఠశాలలో చొరబడేందుకు కూడా యత్నించాడు. అగంతకుడిని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై కాల్పులతో విరుచుకుపడి నలుగురిని హతమార్చాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అగంతకుడ్ని కాల్చిచంపారు. సాయుధుడ్ని కెవిన్ గా గుర్తించిన పోలీసులు కాల్పలకు తెగబడేందుకు మాత్రం కారణాలు తెలియరాలేదని చెప్పారు.

పాఠశాలలోకి చోరడేందుకు యత్నించగా అడ్డుకున్న క్రమంలో దుండగుడు జరిపిన కాల్పల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తూటాగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్సను అందిస్తున్నారు. అయిేత వీరిలో ఇద్దరు విద్యార్థులు కూడా వున్నారని సమాచారం. కాగా కాల్పులు జరిపిన కెవిన్ వృద్ధుడని, అతను ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకోవాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles