Ryan student killed Pradhuman claims CBI చిన్నారిని చంపింది క్లీనర్ కాదు ఇంటర్ విద్యార్థే.!

Cbi claims class xi student who wanted exams postponed killed pradyuman

pradyuman case update,pradyuman thakur case, pradyuman thakur latest news, pradyuman murder case latest news, pradyuman case latest news in hindi Pradyuman Thakur, Pradyuman Thakur murder case, Ryan International School, CBI, Pintos, Gurgaon school, crime

In murder case of Ryan International School student Pradyuman Thakur, the CBI detained a class XI student of the school for questioning in connection with the student's brutal killing.

చిన్నారి హత్యకేసులో ఇంటర్ విద్యార్థే నిందితుడు!

Posted: 11/08/2017 12:52 PM IST
Cbi claims class xi student who wanted exams postponed killed pradyuman

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఢిల్లీలోని కార్పొరేట్ స్కూల్ లోని చిన్నారి విద్యార్థి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసులో నిందితుడు ఆ పాఠశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థేనని చెబుతున్న సీబిఐ ఈ కేసులో స్కూల్ బస్సు కండెక్టర్ నిందితుడు కాదని చెబుతోంది. కార్పోరేట్ పాఠశాలలో విద్యార్థి హత్య ఘటన కలకలం రేపడంతో దీనిని సీబిఐకి అప్పగించారు. దీంతో విచారణ ప్రారంభించిన సిబీఐ సాక్షాధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

తమకు అందిన అధారాల మేరకు ఇవాళ వివరాలను తెలియజేసిన సీబీఐ.. ఎవరూ ఊహించని విషయాలు చెప్పింది. సెప్టెంబర్ 8వ తేదీ ఢిల్లీ గుర్ గామ్ లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ప్రద్యుమన్ ఠాకూర్ మర్డర్ కేసులో నిందితుడు అదే పాఠశాలలో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థేనని తమ విచారణలో తేలిందని అన్నారు. నిన్న రాత్రి ఇంటర్ విద్యార్థిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే కేవలం పరీక్షలను వాయిదా వేయించేందుకు మాత్రమే ఆ విద్యార్థి చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్ ను హతమార్చినట్లు తమ దర్యాప్తుతో తేలిందని అన్నారు.

ఇంటర్ విద్యార్థి ప్రమేయంపై ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సీబీఐ అంటోంది. మొదటగా బాత్రూమ్ లో ప్రద్యుమన్ చనిపోయి ఉన్న విషయాన్ని ఈ స్టూడెంట్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. యాజమాన్యానికి చెప్పింది కూడా ఈ స్టూడెంటేనని పాఠశాల యాజమాన్యం కూడా చెబుతుంది. కాగా ఇంటర్ విద్యార్థి తండ్రి మాత్రం తన కుమారుడ్ని సీబీఐ అధికారులు అనవసరంగా అరెస్ట్ చేశారని తెలిపాడు. తన కొడుకుకి ఈ హత్యతో సంబంధం లేదని చెబుతున్నారు. హత్య జరిగినప్పుడు పరీక్ష రాస్తున్నాడని పేరంట్స్ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pradyuman  CBI  Inter Student  bus cleaner  Ryan International School  Gurgaon  crime  

Other Articles