Airtel revamps Rs 349 plan to give 42GB data: 50 శాతం అదనపు డేటా ఫ్రీ.. ఎయిర్ టెల్ ఆఫర్

Airtel revamps popular rs 349 plan offers 50 percent more data

airtel, airtel offer, airtel recharge, airtel online recharge, airtel india, airtel Rs 349, airtel 349, airtel 1gb, airtel data offers, 1g data per day

Bharti Airtel has just revamped its Rs 349 recharge plan. Under the new offer, Airtel is offering more data to its subscribers at the same Rs 349 value.

50 శాతం అదనపు డేటా ఫ్రీ.. ఎయిర్ టెల్ ఆఫర్

Posted: 11/08/2017 01:44 PM IST
Airtel revamps popular rs 349 plan offers 50 percent more data

స్మార్ ఫోన్ ప్రియులుకు చేతిలోనే ప్రపంచాన్ని అందించి.. అప్పటి వరకు డేటా వినియోగంపై వున్న ఆఫర్లు ఓ ఎత్తు.. తమది మరో ఎత్తు అంటూ టెలికాం రంగంలోని దిగ్గజ సంస్థలకు గట్టిపోటీనిచ్చి. వణుకు పుట్టించిన రిలయన్స్‌ జియోకు.. మరింత పోటీ ఇచ్చేందుకు భారతీ ఎయిర్ టెల్‌ మరో సరికొత్త ఆఫర్ ను కస్టమర్లకు అందుబాలులోకి తీసుకువచ్చింది. ఏ డేటా అయితే ఉచితంగా ఇచ్చి తమ కస్టమర్లను జియో లాగేసుకుందని టెలికాం సంస్థలు భావిస్తున్నాయో.. అదే డేటాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50శాతం ఉచితంగా అందించేందుకు ఎయిర్ టెల్ రెడీ అయ్యింది.

అయితే ఇది అన్ని ఫ్లాన్ కు వర్తింపజేయకుండా కేవలం రూ.349 ప్లాన్ పై మాత్రమే అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ పై ప్రస్తుతం 1జీబీ డేటా అందిస్తుండగా... ఇక నుంచి రోజుకు 1.5జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంటే ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న దాని కంటే 50 శాతం ఎక్కువన మాట. కాగా ఈ ప్లాన వాలిడిటీలో ఎలాంటి మార్పు లేదు. 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్ లో యథావిధిగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్, 3వేల ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

ఇటీవలే ఈ ప్లాన్ పై పరిమిత కాల వ్యవధిలో 100 శాతం క్యాష్ బ్యాక్ అపర్ ను కూడా ఎయిర్ టెల్ అందించిన సంగతి తెలిసిందే. రూ.349 ప్లాన్ పై ఈ మరింత డేటా అందించడంతో పాటు రూ.448తో మరో కొత్త ప్లాన్ ను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 70జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతేకాక ఈ ప్లాన్ పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్ పై ఉచితంగా అవుట్ గోయింగ్‌ కాల్స్‌, 3000 ఎస్‌ఎంఎస్ లు అందుబాటులో ఉంటాయి. మై ఎయిర్ టెల్‌ యాప్ ద్వారా ఈ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles