Explosion at NTPC Unchahar Plant in Raebareli, 12 Dead ఎన్టీపిసీ పరిశ్రమలో పేలిన బాయిలర్.. 12 మంది మృతి

12 killed 100 injured after explosion in ntpc coal plant in rae bareli

RAE BARELI, NTPC, thermal plant, explosion, deaths, injuries, NTP

An Ash-pipe at the NTPC plant in Uttar Pradesh's Rae Bareli exploded leaving at least 12 killed and over 100 injured, the state home department said.

ఎన్టీపిసీ పరిశ్రమలో పేలిన బాయిలర్.. 12 మంది మృతి

Posted: 11/01/2017 07:02 PM IST
12 killed 100 injured after explosion in ntpc coal plant in rae bareli

ఉత్తర్‌ప్రదేశ్లోని రాయ్ బరేలిలో ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంటులో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రాయ్ బరేలి ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఎన్టీపీసీ ఉంచహార థర్మల ప్లాంటులోని ఆరవ యూనిట్ లో ఇవాళ సాయంత్రం ఈ పేలుడు సంభవించింది.

బాయిలర్‌ పైప్‌ తెరిచిన వెంటనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు మారిషస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయం తెలిసిన వెంటనే స్పందించారు. తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం తెలియజేయాలన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చోప్పున నష్టపరిహారాన్ని ప్రకటిస్తూ.. ఈ మేరకు ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి (ఇన్ఫర్మేషన్) అవనీష్ అవస్థి తెలియజేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నామని రాయ్ బరేలీ ఎస్పీ శివ్ హరి మీనా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RAE BARELI  NTPC  thermal plant  explosion  deaths  injuries  NTP  

Other Articles