Athawale proposes Rahul marry a Dalit girl రాహుల్ వివాహానికి కేంద్రమంత్రి ప్రపోజల్

Rahul gandhi not a pappu anymore says union minister ramdas athawale

Rahul Gandhi, congress, dalit girl, shiv sena, sanjay raut, ramdas athawale, Politics, republic party of india, union minister, casteism, pappu

Union Minister Ramdas Athawale suggested the Congress vice-president Rahul Gandhi to marry a Dalit woman. He stated that casteism cannot be eradicated merely by having meals with people of the community.

రాహుల్ వివాహానికి కేంద్రమంత్రి ప్రపోజల్

Posted: 10/30/2017 10:44 AM IST
Rahul gandhi not a pappu anymore says union minister ramdas athawale

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తన వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ.. ప్రజలను జాగృతం చేస్తూ ముందుకు దూసుకెళ్లున్న రాహుల్ గాంధీలోని పరిపక్వతను చూసి సోంత పార్టీ నేతలు సంతోషపడుతున్న క్రమంలో.. ఇక మిత్రపక్ష పార్టీలు కూడా జతకట్టడం సహజమే. అయితే తమ పక్షానికి చెందని పార్టీల క్రియాశీలక నేతలు కూడా రాహుల్ గాంధీలోని పరిపక్వతను ప్రశంసిస్తున్నారు.

ఇటీవల శివసేన పార్టీ అధికర ప్రతినిధి.. సీనియర్ నేత సంజయ్ రౌత్ రాహుల్ దూసుకెళ్లున్నాడంటూ వ్యాక్యాలు చేయగా, తాజాగా ఆయనకు మరో కేంద్రమంత్రి కూడా మద్దుతు పలికాడు. పరిపక్వత గత రాజకీయ నేతగా మెలుగుతూ.. అధికార పార్టీని, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని, ఆయన విధానాలను తూర్పారబడుతున్న రాహుల్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తి.. ఒక సూచన కూడా చేశారు. దీంతో రాహుల్ ను కోనియాడుతున్న నేతల జాబితాలో కేంద్రమంత్రి కూడా చేరిపోయారు.

ఇకపై రాహుల్ గాంధీని తేలికగా తీసుకుని వదిలేయలేమని.. ఆయన రోజురోజుకూ తన సత్తా చాటుకుంటూ దూసుకెళ్తున్నారని అధికార ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, కేంద్ర మంత్రి, రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. రాహుల్ లో ఇప్పుడు చాలా అత్మవిశ్వాసం కనిపిస్తుందని, దేశ రాజకీయ నేతగా ఎదుగుతున్న క్రమంలో ఆయనలో మంచి లక్షణాలు కూడా పెరుగుతున్నాయని, ఆయన ప్రసంగాలు కూడా ప్రజలను అకట్టుకునేలా సాగుతున్నాయని అన్నారు.

మహారాష్ట్రలోని అకోలాలో పర్యటించిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రి అథావలె.. సరిగ్గా శివసేన నేత సంజయ్ రౌత్ రాహుల్ గొప్ప నేతగా ఎదుగుతున్నాడని వ్యాఖ్యానించిన తరువాత ఆ బాటలోనే తన వాణిని వినిపించారు కేంద్ర మంత్రి అథవాలే. అయితే ఈ క్రమంలో ఆయన రాహుల్ గాంధీకి ఓ సూచన చేశారు. దేశంలో కులవ్యవస్థ రూపుమాసిపోవాలంటే.. రాహుల్ లాంటి నేతలు దళిత యువతిని పరిణయమాడాలని సూచించారు.

రాహుల్ వివాహాంపై తాను హాస్యాస్పదంగా మాట్లాడాలనో, లేక వివాదాస్పదం చేయాలనో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థ వల్ల జరుగుతున్న అనర్థాలను నిలువరించడానికి.. ఇలాంటి సందేశాలను ఉన్నతోన్నతమైన స్థాయిలో వున్న వ్యక్తలు చేయడం వల్ల యావత్ దేశానికి అదర్శంగా మారుతారని అథావలే అభిప్రాయపడ్డారు. కేవలం దళితులతో కలసి బోజనాలు చేయడం వల్ల.. దళిత కుటుంబాలకు న్యాయ జరగదని అథవాలే వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  congress  dalit girl  shiv sena  sanjay raut  ramdas athawale  Politics  

Other Articles