panel to probe infant deaths in Ahmedabad hospital గుజరాత్ శిశుమరణాలపై.. త్రిసభ్య కమిటీ..

Congress seeks judicial probe into infants death at ahmedabad civil hospital

Gujarat, Gujarat government, infant death probe, infant death Ahmedabad hospital, infant death probe panel, judicial enquiry, congress, poll bound state, BJP

The Gujarat government set up a three-member expert committee to inquire into death of nine infants in 24 hours at the Ahmedabad Civil Hospital.

గుజరాత్ లో శిశుమరణాల కలకలం.. త్రిసభ్య కమిటీ..

Posted: 10/30/2017 11:32 AM IST
Congress seeks judicial probe into infants death at ahmedabad civil hospital

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లో పెను సంచలనం కలిగించిన శిశుమరణాలు.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న గుజరాత్ కు పాకింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో 36 గంటల్లో 11 మంది శిశువులు చనిపోవటం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నుంచి (అనగా గత మూడు రోజులుగా) లెక్కిస్తే ఈ సంఖ్య 18కి చేరింది. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

ఈ పిల్లలు లూనావాడ, మాన్సా, విరామ్‌గావ్, హిమ్మత్‌నగర్, సురేందర్‌నగర్ ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో నలుగురు పిల్లలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నావారేనని సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఇంక్యుబేటర్ల కారణంగా చనిపోలేదని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎన్నికలపై దాని ప్రభావం కూడా పడుతుందని అధికార పార్టీలు భావిస్తున్నాయి.

 అయితే ఇదే సమయంలో ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్ మాత్రం అహ్మాదాబాద్ ప్రభుత్వ అసుపత్రిలో జరిగిన నవజాత శిశుమరణాల ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం తమ తప్పను కప్పిపుచ్చుకునే చర్యలకు పూనుకుంటుందని, ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత న్యాయ విచారణ జరపించాలని డిమాండ్ చేసింది. ఇక అస్పత్రి సూపరింటెండెంట్ ఎం.ఎం.ప్రభాకర్. అయితే ఆస్పత్రిలో వసతులపై వస్తున్న కంప్లయింట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : infant death  probe  Ahmedabad hospital  3 member panel  judicial enquiry  congress  BJP  

Other Articles