three held for selling obscene video cds బోర్డుపై వున్నది బేకరీ.. కానీ లోనంతా పాడుపనే..

Three held for selling obscene video cds in karimnagar

sri lakshmi food world bakery, obscene video cds, karimnagar, task force wing, shastri road, gurram sripal reddy, vavilalapalli, kisannagar pulluri vineeth, durgammaguda, mohammad taj, ci vijay kumar, si vamsi krishna, task force si santosh, nagaraj, Telangana, crime

Three youth held for selling obscene video cds in the bakery shop, downloading them from internet. Task force police arrested them and booked sumoto cases against them.

బోర్డుపై వున్నది బేకరీ.. కానీ లోనంతా పాడుపనే..

Posted: 10/17/2017 03:13 PM IST
Three held for selling obscene video cds in karimnagar

తమ వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదో ఏమో.. పక్కదారి పట్టిన దుకాణ యజమాని.. తాను ఒక  యువకుడినేనన్న సంగతి విస్మరించి.. డబ్బుకు లోకం దాసోహమన్న నానుడిని నమ్మి.. పాడుపనికి శ్రీకారం చుట్టాడు. తన దుకాణం కేంద్రంగా యువతను పెడదారి పట్టించాడు. గత రేండేళ్లుగా సాగుతున్న ఈ తంతును అత్యంత గుట్టుగా జరపినా.. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. బేకరి యజమానితో పాటు అందులో పనిచేసే యువకుడ్ని, వీడియోలను రైట్ చేసి మరో యువకుడ్ని అదుపులోకి తీసుకుని వారిపై సుమోటో కింద కసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లాలో శాస్త్రీ రోడ్డులోని శ్రీమహాలక్ష్మీ ఫుడ్ వరల్డ్ బేకరీలోకి అకస్మాత్తుగా వచ్చిన పోలీసులు..గుట్టలకొద్ది అశ్లీల సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వావిలాలపల్లికి చెందిన గుర్రం శ్రీపాల్‌రెడ్డి ఈ బేకరీని నడుపుతున్నాడు. అతని అనుచరుడు కిసాన్‌నగర్‌కు చెందిన పుల్లూరి వినీత్‌ కలిసి బేకరీలోనే గుట్టుచప్పుడు కాకుండా ఒక కంప్యూటర్‌ను ఏర్పాటుచేసి ఇంటర్‌నెట్‌ ద్వారా అశ్లీలచిత్రాలను డౌన్‌లోడ్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాలను సీడీలలో నింపి దుర్గమ్మగడ్డకు చెందిన మహ్మద్‌ తాజ్‌తో ఒక్కటి 150 రూపాయలకు విక్రయిస్తున్నారు.
 
ఈ అక్రమ దందాకు సంబంధించి శ్రీపాల్ రెడ్డి, వినీత్‌, తాజ్ లను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఒక కంప్యూటర్‌, మానిటర్‌, హోంథియేటర్‌, సెల్‌ఫోన్‌, మెమోరీ కార్డు 304 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఆక్ట్‌ 2000 కింద ముగ్గురు నిందితులపై సుమోటో కేసు నమోదు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీతోపాటు కరీంనగర్‌ మూడోఠాణా సీఐవిజయ్‌కుమార్‌, ఒకటవ ఠాణా ఎస్‌ఐ వంశీకృష్ణ, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐలు సంతోష్‌, నాగరాజులున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles