PM Modi Says Can't Move Ahead Without Pride in Heritage బీజేపి ఎమ్మెల్యేకు చెంప చెల్లుమనిపించేలా ప్రధాని జవాబు..

Taj mahal controversy pm modi says can t move ahead without pride in heritage

All India Institute of Ayurveda, BJP MLA Sangeet Som, Hindu-Muslim, Indian heritage, Modi Sangeet Som, prime minister narendra modi, sangeet som, Sangeet Som Taj Mahal, shahjahan, Som Taj Mahal, Taj Mahal, taj mahal blot on india, UP tourism booklet, Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Uttar Pradesh tourism, Yogi Adityanath

In an apparent reference to BJP MLA Sangeet Som’s comments that the Taj Mahal was a “blot on Indian culture”, PM Modi said no country can move ahead without pride in heritage.

బీజేపి ఎమ్మెల్యేకు చెంప చెల్లుమనిపించేలా ప్రధాని జవాబు..

Posted: 10/17/2017 04:12 PM IST
Taj mahal controversy pm modi says can t move ahead without pride in heritage

ప్రపంచ వింతల్లో ఒక్కటిగా ప్రఖ్యాతి చెందని చారిత్ర్మక కట్టడం తాజ్‌ మహల్‌ అంశంలో ఎట్టకేలకు స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ.. బీజేపి ఎంపీ సంగీత్ సోమ్ చెంప చెల్లుమనిపించేలా జవాబిచ్చారు. తాజ్ మహాల్ దేశ సంస్కృతికి మాయని మచ్చని, దేశద్రోహులు కట్టిన నిర్మాణమని పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో దానిని తీవ్రంగా ఖండించిన ప్రధాని నరేంద్రమోడీ వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వారసత్వ కట్టడాలను మరిచి ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదని ప్రధాని ఉద్ఘాటించారు.

'చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవు. ఒక వేళ అలా చేయాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక కచ్చితమైన సమయంలో తమ గుర్తింపును కోల్పోతారు' అని వ్యాఖ్యానించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఆయన తాజ్ మహల్ పై మాట్లాడారు. అటు బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా తాజ్ మహల్ ను పర్యాటక ప్రాంతాల జాబితాలో పేర్కోనకపోవడంపై ధుమారం రేగుతూన ఉంది.

ఇదే సమయంలో యోగి ఆదిత్యనాథ్‌ కూడా అపఖ్యాతిని తమ ప్రభుత్వానికి అంటకుండా చర్యలకు ఉపక్రమించింది. తాజ్ మహాల్ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు అయన వ్యక్తిగతమైనవని చెప్పారు. ప్రపంచ పటంలో తాజ్ మహల్ ను అగ్రభాగంలో నిలపాలన్నదే తమ ధ్యేయం అని యోగి చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 26న తాను తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే యోగా సర్కార్ రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్ ను స్థానం కల్పించకుండా ఎలా అగ్రభాగాన నిలుపుతారన్న ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో సంగీత్‌ సోమ్‌ వ్యాఖ్యలపై విపక్షాలు ఎక్కుపెడుతున్నాయి. అడుగుముందుకేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం పేరునూ మార్చేందుకు బీజేపీ ప్రయత్నించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ అజెండానే సంగీత్‌ సోమ్‌ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యం కాదని అవి నియంతృత్వ పోకడలేనని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం మనదన్న విషయాన్ని బీజేపి మర్చిపోయిందని అన్నారు.

దేశ ఐక్యత, సమగ్రతలకు విఘాతం కల్గిగేలా ఏ ఒక్కరూ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాల్సిన అధికార పార్టీ.. ఎమ్మెల్యేలే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన చేసే ఇలాంటి వ్యాఖ్యలు దేశ వారసత్వ, చారిత్రక విలువలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌పై బీజేపీ ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.బీజేపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  Yogi Adithya Nath  taj mahal  oppostion parties  PM Modi  Heritage  History  

Other Articles