3-Year-Old Becomes Living Goddess Of Nepal ఈ చిన్నారి త్రిష్ణే నేపాలీల ‘‘లివింగ్ గాడెస్’’

Three year old girl child anointed as living goddess in nepal

nepal, nepal living goddess, nepal girl, nepal goddess, nepa family, nepal girl goddess, Nepalese, goddess, Kumari, Goddess Taleju, religion, children, women, Nepal, tradition, world news

Nepal selected a three-year-old as the new ‘Kumari’ regarded as the living Goddess in the country keeping with the tradition that has outlived two Royal dynasties over more than four centuries

ఈ చిన్నారి త్రిష్ణే నేపాలీల ‘‘లివింగ్ గాడెస్’’

Posted: 09/29/2017 05:18 PM IST
Three year old girl child anointed as living goddess in nepal

నేపాల్ లో హిందూ మత గురువులు మూడేళ్ల బాలిక త్రిష్ణా శాక్యను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకసారి కుమారీగా ఎంపికైన బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు దేవతగా ఉండనున్నారు. నాలుగేళ్ల యవస్సులో కుమారీగా మారిన 'ప్రీతి శక్యా' యుక్త వయస్సుకు చేరుకుంది. దీనితో తాజా ఎంపిక అవసరమైంది. నేపాల్ అధ్యక్షుడు ఆమోదం తెలుపడంతో ఎంపిక ప్రక్రియను చేపట్టారు.

క్రీ.శ. 12-18 శతాబ్దాల మధ్యలో నేపాల్ ను మల్ల రాజుల పరిపాలించాడు. ఆయన ఆరాధ్య దేవత 'తలెజు'. ఈ కుమారీలను మానవరూపంలో తమ ఇష్టదైవమైన 'తలెజు'గా భావిస్తారు. ఇక కుమారీల ఎంపికకు కొన్ని కఠిన పరీక్షలుంటాయి. మూడు వారాల పాటు కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అంతకంటే ముందు ఎలాంటి లోపాలు లేని కళ్లు ఉండాలి. దంతాలు ఉండాలి. అలాగే శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు. అత్యంత ధైర్యసాహసాలు కలిగి ఉండాలి. బలి ఇచ్చిన పశువుల మధ్య ఓ రాత్రి అంతా ఉండాలి. ఇలాంటి కొన్ని కఠిన పరీక్షలు..ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది.

ఇక కుమారీలను పటాన్, ఖాట్మాండు, భక్తపూర్ ల నుండే ఎంపిక చేయబడుతారు. గుత్తి సంస్థాన్ నిర్వాహణ కమిటీ (జీఎన్ఎంసీ) సిఫార్సుల మేరకు కుమారీ ఎంపిక జరుగుతుంది. కుమారీగా ఎన్నికైన అనంతరం రజస్వల కాగానే ఆమెలో దైవత్వం పోతుందని అక్కడివారి నమ్మకం. అప్పటి నుంచి మరో కుమారిని ఎన్నుకునేందుకు పరీక్షలు జరుగుతాయి. ఎంపిక అనంతరం కూడా కొన్ని కఠిన నియమ నిబంధనుంటాయి. రాజధాని ఖాట్మాండులోని పురాతన ఆలయంలో మత ఆచారాల ప్రకారం కుమారీలను ప్రత్యేక సంరక్షణలో ఉంచుతారు. వారు ఎరుపు దుస్తులను ధరించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepalese  goddess  Kumari  Goddess Taleju  religion  children  women  Nepal  tradition  

Other Articles