TDP leader to be new TTD board chairman టీటీడీ చైర్మన్ గా కడప జిల్లా టీడీపీ నేత..

Kadapa tdp leader to be nominated as new ttd board chairman

Tirumala Tirupati Devasthanams, Putta Sudhakar Yadav, sudhakar yadav, kadapah, cuddapah, ttd board chairman, dl ravindra reddy, Mydukuru, ys jagan, chandrababu, politics

The state government decided on appointing Kadapa TDP leader Putta Sudhakar Yadav as chairman of the Tirumala Tirupati Devasthanams (TTD) Trust Board.

టీటీడీ చైర్మన్ గా కడప జిల్లా టీడీపీ నేత

Posted: 09/29/2017 06:00 PM IST
Kadapa tdp leader to be nominated as new ttd board chairman

చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగియడంతో ఆ పదవిపై కన్నేసిన పార్టీ ఎంపీ రాయపాటీ కాసింత అసహనానికి గురికావడంతో.. ఆయనను శాంతింపజేసిన పార్టీ అధిష్టానం.. ఈ పదవికి మరో నేతను ఎంపిక చేసింది. రమారమి ఆయనకే ఆ పదవికి కూడా దక్కనుంది. ఇంతకీ ఆ పదవి ఏంటంటారా..? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్. మరీ ఆ నేత ఎవరంటారా..? పుట్టా సుధాకర్‌యాదవ్‌. పార్టీలో కేవలం జిల్లాస్థాయిలో అందులోనూ కేవలం తన నియోజకవర్గ పరిధికి మాత్రమే పరిమితమైన నేతను.. టీటీడీ చైర్మన్ గా ఎంపిక చేసిందని, ఇక రమారమి ఆయన పేరును అధికారింగా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం.

అయితే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందాన్ని టీడీపీ అనుసరిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి, కడవ జిల్లా మైదుకూరుకు చెందిన సుధాకర్ యాదవ్ కు టీటీడీ పగ్గాలను అందించి.. రానున్న ఎన్నికలలో ఆయనను పక్కకు తప్పించి.. ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారల్లో చురుగ్గాల పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్‌ పేరును టీటీడీ చైర్‌పదవికి ఖరారు చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.

ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌ను ఇటు రాష్ట్రంతో పాటు అటు ఇతని సొంత జిల్లా కడపలో కూడా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... టీటీడీ చైర్మన్‌ పేరు ఖరారు చేసే విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మైదుకూరుకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం సుధాకర్‌యాదవ్‌ పేరును ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కడప జిల్లాలో జగన్‌ను వైసీపీని దెబ్బకొట్టొచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudhakar yadav  kadapah  cuddapah  ttd board chairman  dl ravindra reddy  ys jagan  chandrababu  politics  

Other Articles