see how chandrababu photo used by education employees సీఎం ఫోటోను ఇలా వాడతారా..? ఇదే భావితరాలకు నేర్పుతారా.?

See how chandrababu photo used by education employees

chandrababu, CM, CM Photo, Education Department, secretariat, Ganta srinivasa Rao, Andhra Pradesh

It is said that education department employees used chandrababu naidu photo as dustbin and thrown paper plates on his photo in AP Secretariat

సీఎం ఫోటోను ఇలా వాడతారా..? ఇదే భావితరాలకు నేర్పుతారా.?

Posted: 09/25/2017 07:40 PM IST
See how chandrababu photo used by education employees

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన సచివాలయంలోనే ఘోర అవమానం జరిగింది. ప్రభుత్వాదినేత ఫోటో పట్ల కిందిస్థాయి సిబ్బంది వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో వున్న చంద్రబాబు ఫొటోను చెత్తబుట్టలా వాడేయడ పరాభవం కాకమరేమిటీ. ఉద్యోగులు చిరుపధార్థాలను తిన్న ఎంగిలి పేట్లను చంద్రబాబు ఫోటో పై పెట్టి మరీ వెళ్లడం పట్ల సర్వత్రా అగ్రహం వ్యక్తమవుతుంది.

ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తిన్నారు. అనంతరం అల్పాహారం తిన్న ప్లేట్లను అక్కడే టేబుల్ మీద ఉన్న చంద్రబాబు ఫోటో మీద పడేసి వెళ్లారు. ఇదే సమావేశ మందిరంలో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని దేవుళ్ల ఫొటోలు ఉన్నాయి. వాటిని గోడకు తగిలిచేందుకు తెచ్చిన సిబ్బంది టేబుల్‌పైనే పెట్టారు.

అయితే ఇవాళ ఈ సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు పేపర్ ప్లేట్లలో అల్పాహారం తెప్పించుకున్నారు. అయితే ఆ ప్లేట్లను పెట్టుకునేందుకు సీఎం ఫొటో ఉన్న టేబుల్‌ ను అధికారులు ఉపయోగించారు. తిన్న తరువాత ఆ ప్లేట్లను ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వాధినేత ఫొటోను కూడా పట్టించుకోకుండా చెత్తబుట్టలా వాడుకోవటం విమర్శలకు తావిచ్చింది. చంద్రబాబు పాలనా కేంద్రంలోనే ఆయన ఫొటోపై చెత్త వేయడం సచివాలయంలో ఇపుడు చర్చినీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  CM  CM Photo  Education Department  secretariat  Andhra Pradesh  

Other Articles