PM Modi big announcement sowbhagya scheme పేదలకు ప్రధాని దసరా కానుక.. సౌభాగ్య యోజన పథకం..

Pm modi big announcement sowbhagya scheme

PM Narendra Modi big announcement, piyush goel, Modi gives free power to poor, free power to poor under sowbhagya scheme, PM Modi, latest news

PM Narendra Modi big announcement gives free power to poor under sowbhagya scheme

పేదలకు ప్రధాని దసరా కానుక.. సౌభాగ్య యోజన పథకం..

Posted: 09/25/2017 07:01 PM IST
Pm modi big announcement sowbhagya scheme

దసరా పర్వదినం.., అందులోనూ దేవీ నవరాత్రీ దీక్షలలో వున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ పథాకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవాళ ఢిల్లీలో ప్రారంభించిన సౌభాగ్య యోజనా పథకం కింద దేశంలోని పేదలందరికీ ఉచిత విద్యుత్ పథకాన్ని అందించనున్నాడు. ఈ పథకంలో భాగంగా కేవలం ఒక్క ఫ్యాన్, ఐదు ఎల్ఈడీ బల్బులు వున్న ఇల్లకు ఉచిత విద్యుత్ ను అందించనున్నట్లు ప్రకటించారు.

ఈ పథకం కింద వచ్చే పేదలందరీకి వర్తింపజేస్తామని చెప్పారు. ఈ సౌభాగ్య యోజనా పథకం దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దేశంలోని ప్రతీ ఇంటికీ 2019 మార్చి 31లోగా విద్యుత్ వెలుగులు నింపాలన్నది కూడా తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇక అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అర్థిక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా బిబేక్ దేబ్రాయ్ ను నియమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  big announcement  piyush goel  free power  sowbhagya scheme  

Other Articles