psycho attacked hero srikanth house నటుడి శ్రీకాంత్ ఇంట్లో సైకో వీరంగం.. కార్లు ధ్వంసం

Hero srikanth attacked by psycho damaged cars hurting watchman

srikanth, psycho, watchman, driver, cars, damage, hyderabad police, tollywood, crime

A psycho entered hero srikanth house attacked watchman, drivers and damaged cars in the premises of the house.

నటుడి శ్రీకాంత్ ఇంట్లో సైకో వీరంగం.. కార్లు ధ్వంసం

Posted: 09/23/2017 08:15 PM IST
Hero srikanth attacked by psycho damaged cars hurting watchman

ప్రముఖ తెలుగు సినీ నటుడు, హీరో శ్రీకాంత్ పై అతని ఇంట్లోనే దాడి జరిగింది. ఓ సైకో శ్రీకాంత్ ఇంట్లోకి చొరబడి వీరంగం చేశాడు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. శ్రీకాంత్ ఇంట్లో గతంలో పనిచేసిన వంటమనిషే శ్రీకాంత్ పై దాడికి దిగాడు. అయితే దాడిలో శ్రీకాంత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఆయన ఇంటి వాచ్ మెన్, డ్రైవర్లు కూడా సైకో జరిపిన దాడిలో గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సైకోను అదుపులోకి తీసుకున్నారు.

గతంలో పనిచేసిన వంట మనిషి పనితీరు బాగోలేకపోవడంతో శ్రీకాంత్ అతడ్ని పనిలోనుంచి తీసివేశాడని సమాచారం. అయితే తనను పనిలో నుంచి తీసివేసిన కక్షను మదిలో పెట్టుకున్న వంట మనిషి మళ్లి పని కావాలని శ్రీకాంత్ ఇంటి చుట్టూ పదేపదే తిరిగినా.. నటుడ్ని కలవలేకపోయాడు. అయితే శ్రీకాంత్ ను కలవనీయకుండా అడ్డుపడుతున్న వాచ్ మెన్ పై దాడి చేసి మరీ నటుడి ఇంట్లోకి చోరబడ్డ సైకో.. డ్రైవర్లపై దాడి చేసి.. ఆ తరువాత కార్లను ధ్వంసం చసి.. శ్రీకాంత్ పై దాడికి యత్నించాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srikanth  psycho  watchman  driver  cars  damage  hyderabad police  tollywood  crime  

Other Articles