doctors who evade rural stint will be barred from practice గ్రామాల్లో పనిచేయకపోతే డాక్టర్లపై వేటే

Not done compulsory bond service be treated as bogus doctor maha govt

Bogus doctor, bonded service, compulsory rural service, DMER, Maharashtra, rural service, medical council, maharashtra medical council, devendra fadnavis

All the Medical Practitioners who have obtained Graduate are, hereby informed that it is mandatory for them to submit Bond-free certificate at the time of Renewal of Registration to the Maharashtra Medical Council

గ్రామాల్లో పనిచేయకపోతే డాక్టర్లపై వేటు తప్పదు

Posted: 09/23/2017 07:27 PM IST
Not done compulsory bond service be treated as bogus doctor maha govt

దేశంలో ప్రతీ ఏడాది ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు పూర్తి చేసుకుని వస్తూనే వుంటారు. ఇంజనీర్ల విషయాన్ని పక్కనబెడితే.. డాక్టర్ గా ఒక విద్యార్థి పట్టాను పొందడానికి అయ్యే ఖర్చుమాత్రం చాలా అవుతుందన్ని విషయం తెలుసా.? అందుకు ప్రజాధనం ఖర్చువుతుందన్న విషయం మాత్రం కూడా తెలియని వారు చాలా మందే వుంటారు. అయితే తామేదో కష్టపడి కోర్సును పూర్తి చేసి వైద్యులుగా ప్రజల్లోకి వెళ్లి క్లినిక్ లు లేదా ప్రాక్టీసులు పెట్టేస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఆ విషయాలను తెలుసుకున్న మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నావిస్ ప్రభుత్తం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రజాధనంతో వైద్యులుగా తయారవుతున్న వైద్యలు.. ప్రజల కోసం మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల కోసం వారి సేవలను అందించాలని అదేశాలు జారీ చేసింది. అంతేకాదు గ్రామాల్లో పనిచేయని డాక్టర్లపై వేటు వేస్తామని ప్రకటించింది. గ్రామాల్లోని హెల్త్‌కేర్‌ సెంటర్లలో సేవ చేయకపోతే వైద్య వృత్తికి దూరమవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామాల్లో సేవ చేయడాన్ని ఉల్లంఘిస్తే కొత్త నిబంధనల ప్రకారం డాక్టర్లపై కొంతకాలం లేదా శాశ్వతంగా నిషేధం విధించనున్నారు.

ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రీసర్చ్‌ నిబంధనలతో కూడిన నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామాల్లో పని చేయని వారు.. మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్‌ కోల్పోతారు. సదరు వైద్యులను బోగస్‌ డాక్టర్లుగా పరిగణిస్తాం. వారిపై మహారాష్ట్ర మెడికల్‌ ప్రొఫెషన్‌ చట్టం కింద చర్యలు తీసుకుంటామని.. నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రభుత్వ ఎంబీబీఎస్ కాలేజీల్లో అడ్మీషన్ తీసుకున్నప్పుడే … వారితో బాండ్ రాయించుకుంటోంది ప్రభుత్వం. దాని ప్రకారం విద్యార్థులు తమ కోర్స్‌ పూర్తికాగానే తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొందరు విద్యార్థులు బాండ్‌ను ఉల్లంఘించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles