US resumes premium processing of H-1B visas హెచ్ 1బి వీసాల ప్ర్రక్రియ పున:ప్రారంభించిన యుఎస్

Us resumes h1 b visa processing after 5 months

H-1B visa, H-1B visa premium processing, US Visa, US visa premium processing, US immigration

Five months after suspending the premium process of H-1B visas, the US has now resumed the process. The suspension has, however, been revoked subject to a limit mandated by the US Congress.

హెచ్ 1బి వీసాల ప్ర్రక్రియ పున:ప్రారంభించిన యుఎస్

Posted: 09/19/2017 08:30 PM IST
Us resumes h1 b visa processing after 5 months

అగ్రరాజ్యం అమెరికాకు ఇన్నాళ్లకు భారతీయుల పనితనమంటే ఏంటో తెలిసివచ్చింది. అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్‌-1బీ వీసాల స్వీకరణ ప్రక్రియను ఇన్నాళ్లు దాదాపు ఐదు నెలల తరువాత మళ్లీ అమెరికా పునరుద్ధరించింది. లెక్కకు మించి దరఖాస్తులు రావడంతో ఈ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు ఇవాళ్టి నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వివిధ కంపెనీల్లో పని చేసేందుకు హెచ్‌-1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది.

దీని కింద విదేశీ ఉద్యోగులను తమ కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తారు. హెచ్‌-1బీ వీసా కోరుతూ ఏప్రిల్‌ నెలలో భారీగా దరఖాస్తులు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. 2018కి సంబంధించి ఏప్రిల్‌ వరకూ వచ్చిన హెచ్‌-1బీ వీసాలను పునః పరిశీలిస్తున్నామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ‌(యూఎస్ సీఐఎసక‌) అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 65వేల వీసాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, యుఎస్ నిర్ణయంతో దాదాపుగా 65 వేల మందికి లబ్ది చేకూరనుంది. దీంతో పాటు యూఎస్ ఉన్నత విద్యా డిగ్రీ కలిగిన ఉద్యోగులను తీసుకునేందుకు వచ్చిన 20వేల దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. వీసాల మంజూరు ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయకపోతే దరఖాస్తుదారుడు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజును తిరిగి చెల్లిస్తామని వీసా విభాగం వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles