high court issues notices to chandrababu ఆళ్ల పిటీషన్ పై చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

High court issues notices to chandrababu and 57 others

Chandrababu Naidu, Krishna Karakatta, HIgh Court, River Krishna, 57 Ilegal constructions, mantena satyanarana, Lingamaneni Ramesh, Narsapur MP, gokaraju gangaRaju, krisha river, mangalgiri, vijayawada, guntur

After sadavarti land, YSRCP Mla Alla Ramakrishna Reddy approches High court for illegal constructions in River Krishna.

ITEMVIDEOS: ప్రభుత్వంపై ఆళ్ల న్యాయపోరాటం.. చంద్రబాబుకు నోటీసులు

Posted: 09/19/2017 03:18 PM IST
High court issues notices to chandrababu and 57 others

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోమారు ప్రభుత్వంతో పోరుకు సన్నధమయ్యారు. సదావర్తి భూముల విషయంలో 87 ఏకరాల భూమిని రూ. 22 కోట్లకు విక్రయించేందుకు ప్రభుత్వం సన్నధం కాగా, వాటిపై న్యాయపోరాటం చేసిన అర్కే.. ఎట్టకేలకు ప్రభుత్వం విక్రయించే ధరకంటే రెండున్నరింత లాభాన్ని ప్రభుత్వ ఖాజానాకు వచ్చేట్టు చేశారు. ఇక వీటి కన్న ముందు హైకోర్టును ఆశ్రయించిన ఆయన ఓ మూడేళ్ల క్రితం నుంచి అక్రమంగా సాగుతున్న అంశమై ఆయన మరోమారు హైకోర్టును అశ్రయించారు.

కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పరివాహిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు నిర్మించిన 57మందికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా ప్రతివాదులను కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం తహశీల్దార్ అక్రమనిర్మాణాలను గుర్తించి నోటీసులను జారీ చేసిన నేపథ్యంలో తాను వాటిని తొలగించాలని హైకోర్టును అశ్రయించానని చెప్పారు.

అయితే కృష్ణ నది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును తామిచ్చిన పిల్ నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2016లో అదేశించిందని చెప్పారు. న్యాయస్థానం అదేశాల మేరకు తాను అనేక పర్యాయాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విభాగం అధికారులకు వినతులు ఇచ్చినా వాటిపై స్పందించలేదని చెప్పారు. దీంతో మరోమారు తాను హైకోర్టును అశ్రయించక తప్పలేదని చెప్పారు.  ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని లింగమనేని గ్రూపు నుంచి బలవంతంగా లాక్కును లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నారని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles