nuziveedi iiit comitee suspends 54 students కలకలం రేపుతున్న ట్రిఫుల్ ఐటీ కమిటీ నిర్ణయం..

Nuziveedu iiit ragging issue comittee suspends 54 seniors students

nuziveedu iiit, nuziveedu iiit 54 students suspended, suspension on 15 for an year, 6 nuziveedu iiit students suspended for life, 54 booked for ragging, Fight Between nuziveedu Students, Fight Between Students, Seniors Brutally Beat juniors, nuziveedu iiit ragging, nuziveedu iiit seniors, Seniors Brutally Beats Juniors, Triple IT College, Nuziveedu Triple IT College, Seniors Brutally Beats Juniors in Nuziveedu Triple IT College, vijayawada

executive comittee on Fight between seniors and juniors of Nuziveedu IIIT students ended up by suspending 54 students.

ర్యాగింగ్ పై నూజివీడు ట్రిఫుల్ ఐటీ సంచలన నిర్ణయం..

Posted: 09/18/2017 04:17 PM IST
Nuziveedu iiit ragging issue comittee suspends 54 seniors students

ఇది ర్యాగింగ్ కాదు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు సౌండ్ విషయంలో సీనియర్ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు మధ్య రేగిన చిచ్చు. ఈ విషయంలో తలదూర్చినందుకు జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు గదుల్లోకి పిలిచి మరీ వారిపై దాడి చేశారు. దీంతో జూనియర్లు తిరగబడ్డారు. అయితే హాస్టల్ లో వుండాల్సిన వార్డెన్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అసలేం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా వుండేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది ట్రిఫుల్ ఐటీ యాజమాన్యం.

ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి కఠిన చర్యలు వుంటాయోనన్న విషయాన్ని బయటకు తెలియజెప్పింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది విద్యార్థులకు ప్రమేయం వున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. 54 మందిని మూడు క్యాటగిరీలుగా విభజించి వారికి మూడు రకాలుగా సస్పెషన్లను విధించింది. ఫైనల్ ఇయర్ చదువుతున్న అరుగురు విద్యార్థులను శాశ్వతంగా కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం.. మరో క్యాటగిరికి చెందిన 15 మంది విద్యార్థులపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. ఇక మిగిలిన 33 మందిని వారం నుంచి రెండు నెలల పాటు సస్పెన్షన్ విధించింది.

అయితే సస్సెన్షన్ గురైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారని పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతించినట్లు అద్యాపకులు చెప్పారు. అయితే హాజరు పట్టికలో 70శాతం హాజరు లేని పక్షంలో పరీక్షలు రాసేందుకు అనర్హులన్న విషయం తెలిసి కూడా అధికారులు ఇలాంటి దారుణమైన నిర్ణయాలను ఎలా తీసుకున్నారన్నది తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. విద్యార్థులు ఘర్షణ పడుతున్న సమయంలో హాస్టల్ స్టాప్ సరిగ్గా విధులు నిర్వహిస్తే.. ఇలాంటి ఘటనలు జరగవని, అయితే వారు నిద్రావస్థలోకి జారుకున్న నేపథ్యంలో ఏకంగా సీనియర్లకు జూనీయర్లకు మద్య పెద్ద ఘర్షణే చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nuziveedu iiit  seniors  suspended  juniors  ragging  students  managment  

Other Articles