sadavarthi lands sold for RS.60.30 Cr in auction సదావర్తి భూములతో ఖజానాకు లాభం

Satyanaraya buliders owns sadavarthi trust lands in auction

sadavarthi lands, supreme court, satyanarayana builders, alla rama krishna reddy, Ysrcp MLA, Andhra pradesh, Tamil nadu, kadapa, satyanarayana reddy

As per the directions of supreme court of India, sadavarthi trust lands sold for huge amount in auction. The government was interested to sell away at the cost of Rs.22 Cr. but in auction this lands bought 60.39 Cr revenue for government.

సదావర్తి భూములను దక్కించుకున్న సత్యానారాయణ బిల్డర్స్

Posted: 09/18/2017 02:23 PM IST
Satyanaraya buliders owns sadavarthi trust lands in auction

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు అనేక మలుపులు తిరిగిన సదావర్తి భూములకు బహిరంగ వేలం ప్రక్రియ ఇవాళ విజయవంతంగా ముగిసింది. చెన్నై టీనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో సదావర్తి భూములు రూ.60.30 కోట్ల ధరకు సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ దక్కించుకుంది. అత్యంత ఉత్కంఠకరంగా సాగిన ఈ వేలంలో మొత్తం ఎనమిది సంస్థలు పాల్గొనగా కడప వాసి సత్యనారాయణ రెడ్డి భూములను దక్కించుకున్నారు.

ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ పర్యవేక్షణలో నిర్వహించిన సదావర్తి భూముల వేలం ప్రక్రియలో.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ టెండర్‌ కమ్‌ సీల్డ్‌ కవర్‌ కమ్‌ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్టాడుతూ.. తాను సదావర్తి భూముల కొనుగోలుకు సిద్దపడే వచ్చానని అన్నారు.

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వేలంలో పాల్గొన్నాలని సిద్దపడి.. వచ్చానన్నారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. ప్రస్తుతం సగం ధరను చెల్లిస్తానని, మిగిలింది కూడా నిబందనల ప్రకారం చెల్లించేందుకు తాను సిద్దమని చెప్పారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ భూములు తమకే చెందాలని సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి తనకు తెలుసునని, తమకు భూములు లేదా చెల్లించిన డబ్బులు రెండింటిలో ఏదో ఒకటి తప్పక దక్కుతుందని చెప్పారు. కాగా వేలం పాట మరింత పెరిగిన పక్షంలో తాను పోటీ నుంచి తప్పుకునేవాడినని చెప్పారు. ప్రభుత్వంతో వ్యాపారం చేసినప్పుడు అంతా పారదర్శకంగా వుంటుందన్నారు.

సదావర్తి భూములను గతంలో విక్రయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ మొత్తంతో పోల్చుకుంటే.. తాజా వేలంతో సమకూరిన మొత్తం అత్యంత భారీగా ఉంది. మొత్తం 83 ఎకరాలా 11 గుంటల భూమిని ఏపీ ప్రభుత్వం 22 కోట్ల రూపాయల మొత్తానికే అమ్మేసింది. దీనికి అభ్యంతరం తెలిపిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వీటిని 27 కోట్లకు కొనుగోళ్లకు ముందుకొచ్చారు. అయితే భూములకు వేలం నిర్వహించాలని సుప్రీం అదేశించడంతో.. దాదాపు 38 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles