6 Men Impersonate As IT Officers Arrested ఐటీదాడులను రిపీట్ చేయబోయి.. దేహశుద్ది..

6 men impersonate as it officers raid businessman s house

businessman, Delhi, impersonating as Income Tax officers, IT raid, six persons, South Delhi, raid businessman house, impersonate, income tax, new delhi, naunhyal, officers. crime

Six persons impersonating as Income Tax officers, who came for raiding a businessman's residence in south Delhi, were beaten up by an angry mob before being handed over to the police for extorting Rs 20 lakh.

ఐటీదాడులను రిపీట్ చేయబోయి.. దేహశుద్ది..

Posted: 09/18/2017 01:21 PM IST
6 men impersonate as it officers raid businessman s house

ఐటీ అధికారులు దాడి చేస్తున్నారంటే ఎంతటి అక్రమార్కులకైనా ఒంట్లో భయం బయటకు తన్నుకోస్తుంది. ఇంట్లో వున్న అన్ని అస్తుల తాలుకూ డాక్యూమెంట్లతో పాటు నగలు, నట్రాలకు సంబంధించిన వివరాలను కూడా వారికి తెలియజెప్పాల్సిన అవసరం వుంటుంది. దీంతో ఎక్కడ తప్పులు చెప్పి.. వారి చేతిలో ఇరుక్కుపోతామోనన్న భయం అప్పడప్పుడు లెక్కలన్నీ సరిగ్గా చూపించేవారిలోనూ కనిపిస్తుంది.

ఇలాంటి దాడులు సర్వసాధారణంగా అక్రమంగా డబ్బులు మూటగట్టుకున్నాడన్న వార్తల నేపథ్యం అధికారులు కూపీ లాగి నిజమని తేలిన తరువాతే.. దాడులు చేస్తారు. కానీ ఓ వ్యాపారి ఇంట్లో మాత్రం రెండు పర్యాయాలు అదాయపన్ను శాఖ అధికారులమంటూ దాడులు నిర్వహించారు. అయితే రెండు పర్యాయాలు దాడి చేసింది మాత్రం నకిలీలే. నకిలీ వ్యక్తులే ఐటీ అధికారులమని చెప్పి దాడి చేయడంతో.. ఇరుగుపోరుగువారు వచ్చి వారికి దేహశుద్ది చేసి మరీ పోలీసులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఢిల్లీలోని మాల్వియా నగర్ ఏరియాలో ఓ వ్యాపారి ఇంటికి క్రితం రోజున ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ఇన్ కం ట్యాక్స్ అధికారులమని.. నమ్మబలికిన వ్యక్తులు ఇంట్లో  సోదాలు చేయాలని చెప్పారు. నకిలీలు కావడంతో చకచకా లెక్కలు తేల్చి.. అంతా సక్రమంగానే వున్నా.. ఏదో కారణం చెప్పి.. వ్యాపారి నుంచి 20 లక్షలు లాగేసుకున్నారు. అప్పటికే విషయం తెలిసిన ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని వారిని పోలీసులకు అప్పగించే ముందు కాస్తా దేహశుద్ది చేశారు.

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వ్యాపారి ఇంటికి వచ్చిన నకిలీ అధికారుల విషయం ఇరుగుపోరుగు తెలిసిపోవడానికి కారణం ఏంటీ..? వారు అదాయపన్ను శాఖ అధికారులుకారని వారేలా పసిగట్టారు అంటారా..? అక్కడే వుంది అసలు ట్విస్టు.. గతంలోనూ ఈ వ్యాపారి ఇంటిపై అదాయపన్ను శాఖ అధికారులమని చెప్పి.. కొందరు నకిలీలు ఇలానే దోపిడి చేశారట. దీంతో కొద్దిరోజుల పాటు పోలీసు సెక్యూరిటీ కూడా పెట్టారు. పోలీసు భద్రత లేదని తెలుసుకున్న దొంగలు దోపిడీకి యత్నించడంతో.. ఇలా చిక్కారు.

అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే అటు నకిలీ అదాయపన్ను శాఖ అధికారులపై కేసులు బనాయించి, కటకటాలోకి నెట్టిన పోలీసులు ఇటు వ్యాపారిపై కూడా కేసు పెట్టే విషయమై యోచిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నూతన అర్థిక బిల్లులో ఎవరైనా రెండు లక్షలకు మించి డబ్బును ఇంట్లో పెట్టుకుంటే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వుంటుందని స్పష్టం చేస్తుండడంతో అధికారులు కేసు విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT raids  businessman  impersonate  naunhyal  delhi  arrest  Rs 20 lakh  crime  

Other Articles