Driving licence to be linked with Aadhaar card ప్యాన్, మొబైల్ తరువాత డ్రైవింగ్ లైన్సులకు కూడా..!

Centre plans to link driving licence to aadhaar card

Aadhaar, Aadhaar Card, driving license, Ravi Shankar Prasad, driving license linking with aadhar card, pan card linking with aadhar card, mobile phones linking with aadhar card, subsidy gas cylinder linking with aadhar card, Pan Card, Mobile Phones

Union Minister for Law and Justice and Information Technology Ravi Shankar Prasad said the government will soon link Aadhaar cards with driving license.

ప్యాన్, మొబైల్ తరువాత డ్రైవింగ్ లైన్సులకు కూడా..!

Posted: 09/15/2017 05:03 PM IST
Centre plans to link driving licence to aadhaar card

ఓ వైపు అధార కార్డు వ్యక్తిగత గోప్యతని దానిని భద్రంగా వుంచుకోవాల్సిన ప్రాథమిక హక్కు ప్రతీ పౌరుడికీ వుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో.. ఇక అధార్ ను అన్ని ప్రభుత్వ సంక్షేప పథకాలకు వర్తింపజేయాలా..? వద్దా అన్న అంశమై అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణ కోనసాగుతున్న క్రమంలో ఏ మాత్రం వెనక్కు తగ్గని కేంద్రం.. అన్నింటికీ అధార్ ను అనుసంధానం చేసే ప్రక్రియను మాత్రం వేగవంతం చేసింది.

ఇప్పటికే ప్రతి మొబైల్ వినియోగదారుడు తన అధార్ నెంబరుతో రానున్న ఫిబ్రవరిలోగా అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టు అదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిర్ణత గడువులోగా అనుసంధానించని పక్షంలో సదరు మొబైల్ నెంబర్లకు సేవలను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. ఇక తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ కి కూడా అధార్ అనుసంధానం తప్పనిసరి చేయనుంది. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు స్పష్టం చేశారు. కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన చర్చల్లో ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు.

అయితే డ్రైవింగ్ లైస్సెన్సులతో అధార్ అనుసంధానానికి సంబంధించి త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నామని కేంద్రమంత్రి తెలిపారు. నకిలీ లైసెన్సులను… ఒకే పేరుపై వివిధ ఆర్టీఏ ఆఫీసుల్లో లైసెన్సులు పొందడాన్ని అరికట్టేందుకు ఈ అనుసంధానం దోహదపడుతుందని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై సత్వర చర్యలు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు. డ్రైవింగ్ లైసెన్సులతో పాటు RCలను కూడా ఆధార్ తో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కేంద్ర రవాణాశాఖ దీనిపై పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే లైసెన్సుల జారీ అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే అంశం కాబట్టి.. వాటితో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రారంభించాలని యోచనలో వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar Card  driving license  Ravi Shankar Prasad  pan cards  mobile phones  

Other Articles