Delhi Metro runs with door open on Yellow Line మైట్రో రైలు ప్రయాణంలో భయాందోళనలు..

Delhi metro runs with door open on yellow line

Delhi Metro, Delhi Metro Yellow Line, Delhi Metro open door, Kashmere Gate, Chawri Station, DMRC, Metro, Yellow Line, Metro stuck, Kashmiri Gate, Janakpuri

A metro train packed with passengers made its way from Chawri Bazar to Kashmiri Gate stations on Yellow line with one of its gates open.

ITEMVIDEOS: మైట్రో రైలు ప్రయాణంలో భయాందోళనలు..

Posted: 09/12/2017 12:47 PM IST
Delhi metro runs with door open on yellow line

మెట్రో రైలు ప్రయాణంలో ప్రయాణికులు తీవ్ర భాయందోళనలకు గురైన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రయాణికులే కాదు మెట్రో స్టేషన్లలో వేచి చూస్తూ ఫ్లాట్ ఫారంపై వున్న ప్రయాణికులు కూడా ఈ రైలును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అసలు సంగతేంటీ..? అంటారా.. సోమవారం రాత్రి సుమారు 10గంటల సమయంలో రైల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక బోగీ తలుపు మూసుకుపోలేదు. అయినా రైలు మాత్రం ఒక స్టేషన్ నుంచి మరో రెండు స్టేషన్ల వరకు అలాగే నడిచింది. దీంతో అందోళనకు గురైన ప్రయాణికులు రెండు స్టేషన్లు దాటిన తరువాత.. రైలు డ్రైవర్ కు సమాచారం అందించారు.

సోమవారం రాత్రి ఉత్తర ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లే మార్గంలో వెళ్తున్న ఓ మెట్రో రైలు చార్వి బజార్‌-కశ్మీరీ గేట్‌ మధ్య ప్రయాణించింది. ఆ సమయంలో రైల్లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఓ బోగీ తలుపు మూత పడలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు తెలిపారు. చార్వి బజార్‌ నుంచి కశ్మీరీ గేట్‌ వరకు బోగీ తలుపు తెరుచుకునే ఉండటం.. అది కూడా నిత్యం రద్దీగా వుండే రైల్వేమార్గం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

రెండు స్టేషన్ల వరకు తలపు తెరుచుకునే వున్నా.. డ్రైవర్ పట్టించుకోలేదు. దీంతో కశ్మీరీ గేట్‌కు చేరుకోగానే ప్రయాణికులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత రైలు డ్రైవర్ ను అధికారులు సస్పెండ్‌ చేశారు. 2014లో కూడా ఇదే మార్గంలో మెట్రో రైలు అన్ని తలుపులు తెరుచుకునే ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైల్లో ప్రయాణించే ఓ వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో ఉంచాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Metro  Metro  DMRC  Yellow Line  Metro stuck  Kashmiri Gate  Janakpuri  

Other Articles