TTV fails to stall AIADMK meet, Sasikala ousted అరవ రాజకీయం.. అమ్మకు శాశ్వతం..చిన్నమ్మకు దండం..

Jayalalithaa eternal general secretary sasikala removed says aiadmk

Sasikala, TTV Dhinakaran, AIADMK, J. Jaya Lalithaa, Rajya Sabha, D Jayakumar, Tamil Nadu, politics

The united AIADMK scrapped the post of general secretary in the party, announcing that its former chief J Jayalalithaa will be the "eternal general secretary". The move officially ended the primacy of VK Sasikala and her nephew TTV Dhinakaran.

అరవ రాజకీయం.. అమ్మకే అంకితం.. చిన్నమ్మకు శఠగోపం..

Posted: 09/12/2017 11:55 AM IST
Jayalalithaa eternal general secretary sasikala removed says aiadmk

తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే రసవత్తర రాజకీయాలకు నెలవుగా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ.. ఇటు తమిళ ప్రజలకు అటు రాజకీయ నేతలకు అర్థం కానీ విధంగా తయారవుతున్న రాజకీయాలు.. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు ఏకమైన నాటినుంచి అంతా తెరవెనుక రాజకీయాలకు నెలవుగా మారిందన్న విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగోడతానని బీష్మించిన చిన్నమ్మ మేనల్లుడు టీటీవి దినకరణ్.. మన్నుతిన్న పాములా బుసలు కొడుతుంటే.. అధికారంలో వున్న పళని, పన్నీరు వర్గాలు మాత్రం చకచకా తమ పనులు చేసుకుంటూ వెళ్తున్నాయి.

తాజాగా ఇవాళ జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తమిళనాడు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిన అమ్మ జయలలితను పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీర్మాణం చేసిన అన్నాడీఎంకే .. మరోవైపు జయలలిత నిచ్చెలిగా.. అమె మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలను చేతబట్టి.. చివరకు అక్రమాస్థుల కేసులో బెంగుళూరు పరప్పనా అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు కూడా పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మాణం చేసింది. అమెతో పాటు అమెకు తోడుగా వున్న టీటీవీ దినకరణ్ కూడా పార్టీ నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మాణం చేసింది.

దివంగత జయలలిత స్వయంగా పదవుల్లో నియమించిన వారిని ప్రస్తుతానికి కొనసాగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. రెండాకుల గుర్తు తమకే చెందుతుందని మరో తీర్మానాన్ని కూడా పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక పార్టీ పగ్గాలను కన్వీనర్ హోదాలో తాత్కాలికంగా పన్నిరు సెల్వానికే అప్పగించి.. ఉప కన్వీనర్ గా మాత్రం పళనిస్వామి కోనసాగనున్నారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేంత వరకు పార్టీ కార్యకలాపాలన్నీ పన్నీరు నేతృత్వంలోనే సాగుతాయని పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఇదిలావుండగా, శశికళను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని టీటీవీ దినకరన్ అన్నారు. శశికళను తొలగించడం ఎవరివల్లా కాదని అన్నారు. ఎటువంటి గుర్తింపూ లేని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానాలేవీ చెల్లవని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి ఎన్నటికీ జయలలితేనని, ఆమె ప్రతినిధిగా మాత్రమే శశికళ వ్యవహరిస్తూ వచ్చారని చెప్పిన దినకరన్, తన భవిష్యత్ నిర్ణయంపై మాత్రం మాట దాటవేశారు. పార్టీ నేతలంతా లేకుండా జరిగిన సమావేశం చెల్లదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala  TTV Dhinakaran  Tamil Nadu  AIADMK  Rajya Sabha  D Jayakumar  

Other Articles