Tension arose in Nandyal as TDP-YCP leaders clash నంద్యాలలో ఉద్రిక్తత.. టీడీపి-వైసీపీ నేతల మధ్య ఘర్షణ

Tension arose in nandyal as tdp ycp leaders clash on day after by polls

TDP leader Madhu, abhiruchi madhu, madhu gunman opens fire, tension arose in nandyal, minority leader last rites, nandyal suraj grand hotel, nandyal by polls shedule, nandyal by polls notification, nandyal by polls date, nandyal by polls counting, nandyal, assembly, by-polls, by-elections, election comission, TDP, YSRCP, bhuma nagi reddy, election news

Tension arose in Nandyal as TDP-YCP leaders clash on day after by-polls at suraj grand hotel in minority community leader last journey and rites.

ITEMVIDEOS: నంద్యాలలో ఉద్రిక్తత.. టీడీపి-వైసీపీ నేతల మధ్య ఘర్షణ

Posted: 08/24/2017 12:52 PM IST
Tension arose in nandyal as tdp ycp leaders clash on day after by polls

నిన్నటి వరకు ఉప ఎన్నికల హోరుతో మార్మోగిన నంద్యాలలో ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా తిరగక్కుండానే ఉద్రిక్తంగా మారింది. నంద్యాలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద టీడీపీ, వైఎస్సార్ సిపీ పార్టీలకు చెందిన శ్రేణులు తారసపడటంతో ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మైనారిటీకి చెందిన నేత సలీం భాషా అకస్మిక మరణం నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు హాజరైన ఇరు వర్గాల నేతల మధ్య అలజడి రేగింది. అంతే అప్పటి వరకు నిగురుగప్పిన నిప్పులా వున్న సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

టీడీపీకి చెందిన నంద్యాల కౌన్సిలర్ అభిరుచి మధు కారుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మధు కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మధు గన్ మెన్ గాల్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణీరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు రౌండ్ల కాల్పులు జరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే కాల్పులు గాల్లోకి లక్ష్యంగా చేసుకుని కాల్చారని తెలుస్తుంది. ఈ కాల్పుల నుంచి శిల్పా చక్రఫాణీ రెడ్డి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారని అయన వర్గీయులు తెలిపారు.

తమ పార్టీకి చెందిన నేత సలీం బాషా అంత్యక్రియలకు హాజరైన తమ నేతను కావాలనే టార్గెట్ చేసిన టీడీపీ నేతలు.. ముందస్తుగానే రచించుకున్న ప్రణాళిక ప్రకారం రాళ్ల దాడి చేసి.. తమపై కాల్పులకు కూడా తెగబడ్డారని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాల నేతలను చెదరగొట్టారు, ఇటు శిల్పా చక్రపాణీ రెడ్డితో పాటు అటు మధును బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles