Man bitten by bear after trying to feed it అయ్యో.. పాపం.. అని అన్నం పెట్టేందుకు వెళ్తే..

Bear bites man at china wildlife park where tigers mauled woman to death

Badaling Wildlife Park, Tiger, Women, deaf ears, own Vehicles, park surveillance, wildlife park, visitors safety awarness, chen attacked by bear, chen opened car window, park rangers warned Chen,VIRAL VIDEO

A visitor at the Badaling Wildlife Park, where tigers fatally attacked a woman last year, was bitten by a bear when he rolled down his car window to feed the animal.

ITEMVIDEOS: అయ్యో.. పాపం.. అని అన్నం పెట్టేందుకు వెళ్తే..

Posted: 08/23/2017 02:59 PM IST
Bear bites man at china wildlife park where tigers mauled woman to death

వన్యప్రాణులు నివాసాలుగా మార్చుకున్న సఫారీలలోని జంతువులు.. క్రూరమృగాలని తెలిసి కూడా వాటిపై జాలిపడిన ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. అహారం కోసం వేచి చూస్తున్నాయని భావించి వాటికి అహారం ఇచ్చేందుకు ప్రయత్నించి.. చివరకు క్షతగాత్రుడయ్యాడు. ఈ నేపథ్యంలో వన్యప్రాణులకు ఆహారం ఇవ్వకూడాదని జూ అధికారులు హెచ్చరికలను కూడా తుంగలో తోక్కిన పర్యాటకుడు.. ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అయితే అతని అదృష్టం బాగుందని.. అదే ప్రాంతం నుంచి గతంలో ఓ మహిళా పర్యాటకురాలిని చిరుత పులి ఎత్తుకెళ్లిందని అధికారులు తాపీగా సెలవిచ్చారు.

ఈ ఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నాయో తెలుసా..? చైనాలోని బీజింగ్‌ శివారు బడాలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా తయారైంది. ఈ వన్య ప్రాణి జంతు ప్రదర్శనశాలలోని సఫారీలో ఓ వ్యక్తి తన సొంతకారులో ప్రయాణిస్తూ జంతువులను చూశాడు. అతనికి ఓ చోట ఎలుగుబంట్లు కనిపించాయి. తనకంటే ముందుగా వెళ్లిన పర్యాటకులు వాటికి అహారాన్ని విసిరేసిన దృష్యాలను అతనికి కనిపించాయి.

అయతే వారిలా జాగ్రత్త పడకుండా చెన్ అనే పర్యాటకుడు కూడా ఎటుగుబంట్లకు అహారాన్ని ఇచ్చేందుకుని కారు అద్దం కిందికి దించి వాటికి అహారం అందించాడు. అంతే ఒక్కసారిగా మూడు ఎలుగుబంట్లు వచ్చిపడ్డాయి. దీంతో వెంటనే అతను అద్దాలు పైకి ఎత్తే ప్రయత్నం కూడా చేశాడు. అయినా ఎలుగుబంట్లు చేతుల అడ్డుగా వుండటంతో అది సాధ్యపడలేదు. ఇక చివరికి మళ్లీ ప్రయత్నించి చెన్ అద్దాలను ఎత్తడంలో సఫలమయ్యాడు. ఈ ప్రమాదంలో అతని చేతికి చిన్నపాటి గాయాలయ్యాయి.

అ తరువాత చెన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను అధికారుల మాటలను పెడచెడిన పెట్టి అద్దాలను తెరచి ఎలుగుబంట్లకు అహారాన్ని ఇవ్వడం తన తప్పుగా చెప్పకోచ్చాడు. అయితే ఈ ఘటనలో తనకు స్వల్పంగా గాయాలైయ్యానని, ఆ క్షణంలో తన చెయ్యంతా తీవ్రమైన నోప్పి ఏర్పాడిందని దీంతో.. వెంటనే వెళ్లి పార్కు అధికారులకు విషయాన్ని చెప్పగా.. వారు తనను స్వయంగా అస్పత్రికి వెళ్లి వైద్యులు ఇచ్చే మందులు వాడాలని సెలవియ్యడం ఇంకాస్త బాధించిందని చెన్ చెప్పాడు.

బడాలింగ్ వైల్డ్ లైప్ పార్కకు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. చెన్ తన కారు అద్దాన్ని దించి అహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నక్రమంలోనే అక్కడున్న పార్కు రేంజర్లు అలా చేయవద్దని ఆయను హెచ్చరించారని చెప్పారు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన చెన్ గాయాపడిన స్థలంలోని సిసిటీవీ ఫూటేజీలలో నిక్షిప్తమైన దృశ్యాలను విడుదల చేశారు. అయితే గతేడాది జులైలో ఇదే ప్రాంతంలో కారు నడపలేకపోతున్నానని చెప్పి.. పక్కన సీటులో కూర్చునేందుకు వచ్చిన ఓ మహిళలను చిరుతపులి ఎత్తుకెళ్లిందని తెలిసిన తరువాత చెన్ లో భాయందోళన రేకెత్తింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో మహిళ తీవ్రగాయాలపాలై అస్పత్రిలో చికిత్స పోందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : attack  Badaling Wildlife World  vistors  bear  ZOO  ANIMALS  CHINA  

Other Articles