Telangana couple tops Jharkhand’s extremists list తెలంగాణ భార్యభర్తలపై జార్ఖండ్ ప్రభుత్వం భారీ నజరానా..!

Telangana couple tops jharkhand s extremists list

Sudhakaran, Nilima, Maoist, Jharkhand, Chhattisgarh, Left-wing extremists, People's Liberation Guerrilla Army, Telangana, tri-junction of Latehar, Lohardaga, Gumla districts, Karthik Sen

Sudhakaran, a central committee member of the banned People’s Liberation Guerrilla Army, commands a cash reward of Rs 25 lakh, Nilima has a price of Rs 10 lakh on her head.

తెలంగాణ భార్యభర్తలపై జార్ఖండ్ ప్రభుత్వం భారీ నజరానా..!

Posted: 08/23/2017 12:48 PM IST
Telangana couple tops jharkhand s extremists list

తెలంగాణకు చెందిన దంపతులపై జార్ఖంగ్ రాష్ట్రంలో పోస్టర్లు వెలుస్తున్నాయి. ఈ పోస్టర్లను ముద్రించింది స్వయంగా ఆ రాష్ట్ర పోలీసులే. ఈ దంపతులపై జార్ఖండ్ రాష్ట్ర పోలీసులు ఏకంగా 35 లక్షల రూపాయల నజరానాను ప్రకటించారు. అదేంటో అర్థంకాలేదా..? ఈ దంపతులిద్దరూ మావోయిస్టు కీలక నేతలు. తెలంగాణకు చెందిన వీరు.. మావోయిస్టు సిద్దాంతాలకు అకర్షిుతులై.. ఏకంగా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ మావోయిస్టు కార్యకాలపాల్లో నిమగ్నమయ్యారు. సుధాకర్ ఏకంగా పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదుగాడు. కాగా ఆయన భార్య నీలిమా ప్రత్యక కమిటీ మెంబర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

దీంతో సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఈ మావోయిస్టు దంపతులను పట్టిచ్చిన వారికి భారీ నజరానా ప్రకటిస్తున్నట్లు పోలీసులు పోస్టర్ల ద్వారా ప్రకటించారు. వీరిని చంపినా, సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినా భారీ నజరానా ఇస్తామని జార్ఖండ్ ప్రకటించింది. జార్ఖండ్ పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్న మావో నేతల జాబితాలో 12 పేర్లుండగా, వీరిద్దరే అగ్రస్థానంలో ఉన్నారు. ఇక సుధాకర్ తలపై రూ. 25 లక్షలు, నీలిమ తలపై రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని జార్ఖండ్ పోలీసులు గోడ పత్రికలను ప్రచురించారు.

ఇక ఈ జాబితాలో పేర్లున్న పలువురు మావోయిస్టుల వివరాలు ఇలా వున్నాయి.  పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం జోనల్ కమాండెర్లు రవీంద్ర గంఝూ, దీపక్ ఓరాన్, భూషణ్ ఓరాన్, బలరామ్ ఓరాన్, మునేశ్వర్ ఓరాన్ ల తలపై పది లక్షల రివార్డును ప్రకటించారు. వీరితో పాటు  పీఫుల్స్ లిబరేషన్ గొరిల్లా అర్మీ దళం సబ్ జోనల్ కమాండర్లుగా కొనసాగుతున్న యుగేశ్వర్ యాదవ్, అగ్నూ గంఝూ, బాలక్ గంఝూలపై ఐదు లక్షల రివార్డు, ఇద్దరు ఏరియా కమాండర్లు అనీల్ తూరి, గోవింద్ బిర్జియాలపై కూడా నగదు రివార్డును ప్రకటించారు.

ఇప్పటివరకూ 30 మంది అగ్ర నాయకులను అరెస్ట్ చేశామని, పలువురు వయో భారంతో చురుకుగా లేకపోగా, సుధాకర్, నీలిమ విస్తృతంగా పర్యటిస్తూ, క్యాడర్ ను పెంచుకుంటున్న కారణంగానే, వీరిని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తమ ఇంటెలిజెన్సు వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వారు గుమ్లా జిల్లాలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారని, వారిని త్వరలోనే తమ సిబ్బంది పట్టుకుంటారని లోహర్డగా ఎస్పీ కార్తీక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ లోపు రక్తసిక్తమైన మార్గాన్ని వారు స్వచ్చందంగా వీడి.. తమకు తాముగా ఆ దంపతులే జనజీవన స్రవంతి లోకి చేరాలని కార్తీక్ సేన్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles