Teen survives fall from 164 feet in China యువతికి చుక్కలు చూపించిన బంగీ జంప్..

Teen plunges into river from bungee jump because of staff screw up

Bungee jump, Terrifying Bungee jump, Bungee jump Woman, Bungee jump Fall, Bungee jump Fail, Shidu Natural Park, Beijing southwestern suburbs, china, woman, social media, viral video

Video has gone viral on social media of the terrifying moment when one teenager became separated from her bungee cord, falling hard into the river below.

ITEMVIDEOS: యువతికి చుక్కలు చూపించిన బంగీ జంప్..

Posted: 08/22/2017 02:49 PM IST
Teen plunges into river from bungee jump because of staff screw up

ఎత్తైన కొండపై నుంచి అమాంతం కిందకు దూకితే ఎలా వుంటుందన్న అనుభవాన్ని పొందాలనుకుంటే.. దానినే బంగీ జంప్ అని అంటారు. గాల్లో తేలియాడుతూ సాహసంతో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం చేయడమే బంగీ జంప్. బావగారూ బాగున్నారా.. చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బంగీ జంప్ ను సినిమా ద్వారా పరిచయం చేశారు. అలాంటి బంగీ జంప్ చేయాలంటే గుండె నిండా ధైర్యం... నిబ్బరం, సాహసనోమ్ముఖులై వుండాలి.  సాహసాలు చేస్తూ సమ్ థింగ్ స్పెషల్ గా జీవించాలనుకునే వారు తప్పక చూడాల్సిన వీడియో ఇది.

ఇలాంటి బంగీ జంప్ స్టంట్ నే చేయాలని అసక్తి కనబర్చిన ఓ యువతి ఏకంగా నరకం ముఖద్వారం వరకు వెళ్లి వెనక్కు తిరిగి వచ్చింది. అంతేకాదు దాదాపుగా 169 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడినా.. చిన్నపాటి గాయాలతో బతికి కట్టడం అంటే.. నిజంగా అదృష్టముండాలి. ఈ ఘటన చైనా రాజధాని ప్రాంతం బీజింగ్ లోని వాయువ్య ప్రాంతంలోని జరిగింది. వాయువ్య బీజింగ్ ప్రాంత శివార్లలో వున్న షిడ్డూ నేచ్యూరల్ పార్క్ లో బంగీ జంప్ చేయడానికి వెళ్లిన ఓ యువతికి అత్యంత భాయానక అనుభవం ఎదురైంది.

పార్కులోని బంగీ జంప్ సిబ్బంది యువతి కాళ్లకు కట్టాల్సిన తాళ్లను గట్టిగా కట్టకపోడంతో ఈ ప్రమాదం జరిగింది. అందరు యువతుల మాదిరిగానే ఈ యువతిని కూడా బంగీ జంప్ కోసం రాగా సిబ్బంది కాళ్లకు తాళ్లను కట్టి మమ అనిపించారు. బంగీ జంప్ చేసిన యువతి అలా గాల్లో రెండు సార్లు జంప్ చేసింది. దీంతో అమె వేగం సగానికి పైగానే తగ్గింది. ఈ క్రమంలో కాళ్లకు కట్టిన తాడు ఊడిపోవడంతో అ యువతి అలా జరుకుంటూ కిందనున్న నదిలోకి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన బంగీ జంప్ సిబ్బంది నదిలోకి దూకి యువతని సురక్షింగా ఒడ్డుకు చేర్చారు. అయితే యువతికి ఎటాంటి గాయాలు కాలేదని, ఇక అమెను బయటకు తీసుకురాగానే అమె కళ్లు తెరిచేవున్నాయని అధికారులు చెప్పారు. మీరు ఓ లుక్ వేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Teen  survival  fall from 164 feet  teen girl  woman  social media  viral video  

Other Articles