Charges, complaints galore in Nandyal నేటితో మూగబోనున్న మైకులు.. మరో అంకంలో పార్టీలు బిజీ..

Nandyal bypoll turns into prestige fight for tdp ysr congress

Nandyal, nandyal bypoll andhra pradesh, telugu desam party , chief minister n chandrababu naidu, ysr congress party chief y s jagan mohan reddy, tdp, ysrcp, bramhananda reddy, shilpa mohan reddy, Nandyal By Polls, Congress, Abdul Khadar, TDP, YSRCP, Raghuveera Reddy

THE BYPOLL to the Nandyal Assembly seat in Andhra Pradesh has turned into a prestige issue with Telugu Desam Party president and Chief Minister N Chandrababu Naidu and YSR Congress Party chief Y S Jagan Mohan Reddy campaigning vigorously in the constituency

నేటితో మూగబోనున్న మైకులు.. మరో అంకంలో పార్టీలు బిజీ..

Posted: 08/21/2017 08:41 AM IST
Nandyal bypoll turns into prestige fight for tdp ysr congress

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికకు.. ఇవాళ్టి సాయంత్రంతో ప్రచారం పూర్తి కానుంది. గత ఇరవై రోజులుగా ఉప ఎన్నికల నేపథ్యంలో మారుమోగిన పలు పార్టీల మైకులు ఇవాళ సాయంత్రంతో మూగబోనున్నాయి. ఎన్నిక ప్రచారంత పాటు గెలుపును కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఇవాళ్టి సాయంత్రం వరకు ముమ్మరంగా ప్రచారం చేయనున్నాయి. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచార అంకానికి తెరపడనున్న నేపథ్యంతో మరో అంకానికి కూడా రాజకీయ పార్టీలు తెరలేపనున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని గల్లీ, గల్లీ తిరిగిన పార్టీల నేతలు.. ఇక చివరి ప్రయత్నంలో తాము ఏ మాత్రం విఫలం కాకూడదని బిజీగా మారనున్నారు.

తెరచాటుగా జరగాల్సిన డబ్బు, మద్యం సిసాల పంఫిణీ బాహాటంగా, బహిరంగంగానే జరుగుతున్న పట్టించుకోనే నాధుడే కరువయ్యాడని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం కార్యలయం ముందు ధర్నా చేశారు. తమిళనాడు అర్కే నగర్ ఉపఎన్నికలలో ప్రవహించిన దానికన్నా అధిక రెట్లు ఇక్కడ మనీ, మధ్యం పంఫిణీ జరుగుతున్నాయని అరోపించినా.. ఎన్నికల అధికారులకు మాత్రం అవి కనిపించకపోవడం గమనార్హం. ఇక టీడీపీ ఎమ్మెల్యే.. సినీనటుడు బాలకృష్ణ తన ప్రచారంలో నేరుగా ఓటర్లకు వంద రూపాయల నోట్లను పంచినా పట్టించుకోలేని దృతరాష్ట్ర దృష్టిని ఎన్నికల అధికారులు కొనసాగించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఇక మరికొన్ని గంటల వ్యవధిలో నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఓటర్లను తమ దరికి చేర్చుకునేందుకు పార్టీలు అందివచ్చిన చివరి అవకాశంలో భాగంగా డబ్బు, మధ్యాన్ని పంపిణీ చేసేందుకు కూడా రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు పంచిన డబ్బు, మద్యం ఒక ఎత్తు.. ఇవాళ, రేపు పంఫీణీ చేయడం మరో ఎత్తు.. అన్న రేంజీలో పార్టీలో తనమునకలవుతున్నాయి. ఉపఎన్నికలలో గెలుపోటములు పక్కనబెడితే.. వీటి మూలంగా అధికార, విపక్ష నేతల మధ్య మాత్రం తీవ్రమైన అగాధం ఏర్పడిందనే చెప్పాలి.

ఉపఎన్నికల కోసం ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కొనసాగించిన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్.. డైలాగ్ వార్ కంటిన్యూ చేశారు. ముస్లిం, కాపు నేతలతో సమావేశమైన బాబు.. టీడీపీతోనే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు లేని ఓ రాజకీయ నేత కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాల్సిపోయి.. వారి పిల్లలను టార్గెట్ చేశారని చంద్రబాబు అరోపించారు. కాగా, నంద్యాలలో ప్రచారం చేసిన YCP అధినేత జగన్…చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. వర్షం పడుతున్నా.. ప్రచారాన్ని కంటిన్యూ చేశారు. ఎన్నికల టైంలోనే బాబుకు జనం గుర్తొస్తారని అన్నారు.

టీడీపీ, వైసీపీ తీరుపై.. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆ రెండు పార్టీలు డబ్బులు ఖర్చు చేస్తున్నరంటూ.. నంద్యాల ఎన్నికల అధికారి ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఉప ఎన్నికను వాయిదా వేయాలన్నారు. YCP పై మరోసారి ECకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఈసీని, ప్రజలను YCP తప్పుదోవ పట్టిస్తోందన్నారు. డబ్బులు తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన YCP పై చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న తనను కొందరు బెదిరిస్తున్నారని.. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నటుడు వేణుమాధవ్ ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal By Polls  Congress  Abdul Khadar  TDP  YSRCP  Raghuveera Reddy  

Other Articles