నంద్యాల ప్రచారంకు లాస్ట్ డే.. జగన్ కు కొత్త భయం | Jagan Fears with Bhuma Aides

Jagan tension with nandyala by poll

Nandyala, NandyalaBy Election, Nandyala Jagan Fears, Nandyala Campaign Last Day, YSRCP

Nandyala By Poll YSRCP Leaders Support to Bhuma Family. Jagan Fears with That Reason.

నంద్యాలలో వైసీపీకి అదొక్కటే మైనస్

Posted: 08/21/2017 08:56 AM IST
Jagan tension with nandyala by poll

నంద్యాల ఉపఎన్నికకు నేటితో ప్రచారం ముగియనుంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే ఏ పార్టీ ఏజెంట్లుగానీ, నేతలు గానీ ఉండకూదంటూ ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే సమయం దగ్గరపడుతున్న కొద్దీ భవిష్యత్తుపై భయంతో వణికిపోతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలు వారిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత వివిధ కారణాలతో కుమార్తె అఖిలప్రియ, బావమరిది ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. అయితే నాగిరెడ్డి మరణం తర్వాత సమీకరణాలు మరింత వేగంగా మారాయి. కొందరు భూమా కుటుంబం వెంటే ఉండిపోయినా, 10-15 శాతం మంది మాత్రం వైసీపీతోనే ఉండిపోయారు. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఎటువైపు ఉండాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.

ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ చీఫ్ జగన్ గత కొన్ని రోజులుగా నంద్యాలలో మకాం వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న జగన్ ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సరిగ్గా ఇదే వైసీపీ నేతలను భయపెడుతోంది. ఒకవేళ ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు. ఇప్పటికే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని చెబుతున్న నేతలు.. ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడితే తమ భవిష్యత్తు అంధకారమేనని భయపడుతున్నారు. జగన్ ఈ ఉపఎన్నికను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోయి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఉత్పన్నమై ఉండేదని కాదని అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala  By Election  YSR Congress Party  YS Jagan Mohan Reddy  

Other Articles