lucky lady touches river bank befor it swept away అదృష్టమంటే ఇదేరా.. శివుడాజ్ఞ లేదురా.. వైరల్ వీడియో..!

Woman runs across wobbly bridge seconds later it is swept away

China, Caught on camera, Bridge collapse, Bridge washed away, Floods, Flooding, Flood water, wobbly bridge, social media, viral video, china

Footage being shared widely on social media in China captures the woman running across a rickety bridge on a swollen river. As she makes a dash to the river bank, the bridge behind her starts to collapse.

ITEMVIDEOS: అదృష్టమంటే ఇదేరా.. శివుడాజ్ఞ లేదురా.. వైరల్ వీడియో..!

Posted: 08/18/2017 03:11 PM IST
Woman runs across wobbly bridge seconds later it is swept away

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పెద్దలు చెప్పే నానుడి ముమ్మాటికీ నిజమని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లక్కున్న మహిళ అని అన్నా.. లేక మరేవిధంగా అమెను అభివర్ణించినా.. అమెకు ఇంకా శివుడు అజ్ఞ ఇవ్వలేదు కాబట్టే అమె సాహసం విజయవంతమైంది. లేని పక్షంలో కళ్ల ముందు గమ్యం కనబడుతున్నా.. తన వారు పిలుస్తన్నారు.. వారిని చేరుకోవాలన్న తపన, అత్రుత అన్నింటికీ చెక్ పడేదిం.

క్షణాల తేడాతో తానోచ్చిన వంతెన నీటి ఉదృతితో కొట్టుకుపోవడంతో.. ఆ వంతెన పై నుంచి నడిచి వచ్చి భూమిపై కాలు పెట్టి వెను దిరిగి చూసే సరికి అక్కడ అ వంతెన లేకపోతే.. ఆలా వచ్చిన మహిళ అనుభూతి ఎలా వుంటుందో చెప్పడం సాధ్యమయ్యే పనికాదు. ఇక అనే్క మంది మాత్రం గండం తప్పిందిరా.. అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడయో నెట్టింట్లో వైరల్ గా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియోను 65 వేల మంది వీక్షించారు.

ఈ ఘటన దక్షిణ చైనాలోని  వెన్ క్యూయో ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కుండపోతగా కురుస్తున్నా వర్షాలతో అక్కడి నదులు, వాగులు, వంకలు అన్ని పొందిపోర్లుతున్నాయి. ఇలా ఇరువైపులా నదులు ప్రవహించడంతో అక్కడి వెన్ క్యూయో గ్రామానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అ గ్రామం నుంచి అందరూ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే చివరగా ఆ గ్రామం నుంచి వచ్చిన మహిళ మాత్రం నిజంగా అదృష్టవంతురాలేనన్న వ్యాఖ్యలు వినిపించాయి,

తమ గ్రామం జలదిగ్భంలో చిక్కుతుందన్న సమాచారంతో గ్రామస్థులు తమ ఊరికి ఇరువైపులా వున్న రెండు వంతెనల ద్వారా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ వైపున వున్న ఓ వంతెన గత నెలలో వచ్చిన వరదలతో కొట్టుకుపోగా, తాజాగా తమ అవసరాల కోసం గ్రామస్థులు తాత్కాలికంగా కర్రెలతో మరో వంతెనను నిర్మించుకున్నారు. అయితే ఈ వంతన పై నుంచి అమె వస్తుండగా, ఒక్కసారిగా వరద నీరు ఉదృతి పెరింగింది. దీంతో అమె ఊపిరి బిగపట్టుకుని చివరకు గట్టు చేసింది. అలా అమె గట్టుకు చేరిన క్షణాల వ్యవధిలోనే.. నీటి ఉదృతి మరింత పెరిగి వంతెన కొట్టుకుపోయింది. దీంతో సదరు మహిళ కూడా అదృష్టవంతురాలేనని కామెంట్లు వెల్లివిరిసాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  wobbly brifge  Wenqiao  southern China  social media  viral video  

Other Articles