Another woman stalked in Mumbai, police arrest 2 accused వెంబడిస్తున్న పోకిరీల అటకట్టించిన మహిళా జర్నలిస్టు

2 arrested for stalking after woman journalist tweets their pics to mumbai police

stalking, Two arrested for stalking, Mumbai police, Asira Trannum, scribe, journo, media person, teasing, sexual assault, molestation, mumbai crime, crime

Amboli police arrested two people for stalking a woman journalist Asira Trannum, after she tweeted a picture of the accused and tagged the Mumbai police.

వెంబడిస్తున్న పోకిరీల అటకట్టించిన మహిళా జర్నలిస్టు

Posted: 08/18/2017 02:25 PM IST
2 arrested for stalking after woman journalist tweets their pics to mumbai police

అర్దరాత్రి ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తేందుకు అటోను అశ్రయించి వెళ్తున్న మహిళా జర్నలిస్టును ఇద్దరు పోకరీలు బైక్ పై వెంబడించగా వారి అటను అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవం ద్వారా కట్టించేసిందామె. అయితే అమె చేసిన సంకేతాలకు అనుగూణంగా ముంబై పోలీసులు కూడా సకాలంలో స్పందించడంతో మహిళా జర్నలిస్టు సురక్షితంగా ఇంటికి చేరింది. అంతేకాదు.. రెండు రోజుల వ్యవధిలోనే మహిళా జర్నలిస్టును వెంబడించిన పోకిరీలను అరెస్టు చేశారు.

అటోలో ఎక్కిన జర్నలిస్టును గమనించి.. అమెను వెంబడిస్తూ వచ్చేందుకు వినియోగించిన బైక్ ను కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చారు. కాగా సకాలంలో స్పందించిన పోలీసులకు మహిళా జర్నలిస్టు ధ్యాంక్స్ చెప్పింది. పోలీసుల స్పందించిన తీరుపై ఏకంగా ముంబై పోలీసులందర్నీ హీరో చేసేసింది సోషల్ మీడియా. అన్ని ఠాణాల్లో పోలీసులు ఇలాగే చురుకుగా వుంటే.. నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కామెంట్లు కూడా పెడుతున్నారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రాజధాని, దేశ అర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వున్న తన కార్యాలయం నుంచి తన ఉద్యోగ విధులు ముగించుకుంది అసిరా ట్రన్నుమ్. ఇక జుహూ ప్రాంతంలోని తన నివాసానికి వెళ్లేందుకని అటోను అపింది. అటోలో బయలుదేరిన అమెను.. మార్గమధ్యంలో చిత్రకూట్ సమీపానికి చేరుకోగానే ఇద్దరు యువకులు 5994 నంబర్ గల టూ వీలర్ పై వెంబడించడం మొదలు పెట్టారు. పదే పదే ఆమెను చూస్తూ కామెంట్లు చేశారు.

దీంతో వారి అట కట్టించాలని భావించింది అసిరా ట్రన్నుమ్. అయితే పోకిరీలు ఆటోను ఛేజ్ చేస్తుంటే ఒకొంత భాయనికి కూడా గురైంది. అయినా ధైర్యం చేసి వారి ఫోటో తీయడంతో పాటు, సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది. అందకు ముంబై పోలీస్ అని ట్యాగ్ కూడా చేసింది. దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు, ఆమె సెల్ ఫోన్ ఆధారంగా ప్రయాణిస్తున్న దారిని ట్రాక్ లో ఉంచి, నిమిషాల్లో స్పందించారు. ఈలోగా ఇద్దరు యువకులు మాయమయ్యారు.

అయితే సాంకేతిక విప్లవంతో ఇలాంటి మంచి పనులు కూడా జరుగుతాయని అమె చెప్పడంతో పాటు ముందుగా ముంబై పోలీసులు వేగంగా స్పందించిన తీరు తనను కాపాడిందని అమె తెలిపింది. ఇక మహిళా జర్నలిస్టును వెంబడించిన ఇద్దరు పోకిరీలను రెండు రోజుల వ్యవధిలో పట్టుకున్న ముంబై పోలీసులు వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి కటకటాల వెనక్కి నెట్టారు. వారి వినియోగించిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రోడ్యూస్ చేశారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : scribe  journo  media person  teasing  sexual assault  molestation  mumbai crime  crime  

Other Articles