twist in nandyal by poll scrutiny నంద్యాల ఉపఎన్నికల స్రూటినీలో ఉత్కంఠ..

Tdp ycp bypoll candidates complaint against each other on nominations

nandhyal by-poll, bhuma nagireddy, bhuma bramhananda reddy, shilpa mohan reddy, by-poll scrutiny, jagan mohan reddy, chandrababu, politics

Another twist in nandyal by-poll elections as ruling and major oppostion contestants compalint on each other on nominations during scrutiny

నంద్యాల ఉపఎన్నికల స్రూటినీలో ఉత్కంఠ..

Posted: 08/07/2017 04:27 PM IST
Tdp ycp bypoll candidates complaint against each other on nominations

ఇటీవలే నామినేషన్ల పర్వాన్ని ముగించుకున్న నంద్యాల ఉపఎన్నిక‌ల్లో స్రూట్నీ అంకానికి తెరలేపగా, అదికాస్తా తీవ్ర ఉత్కంఠతకు దారితీసింది. ఎన్నికలలో తలపడుతున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన శ్రేణులకు స్రూట్నీ ప్రక్రియ ఉత్కంఠ రేపుతుంది. వైసీపీ అభ్యర్థి శిల్పామోహ‌న్ రెడ్డి వేసిన‌ నామినేష‌న్ చెల్లద‌ని టీడీపీ వర్గాలు.. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ చెల్లదని వైసీపీ వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో అసలేం జరగబోతుందా..? అని తీవ్ర ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో అలుముకుంది.

ముందుగా టీడీపీకి చెందిన నేతలు విపక్షానికి చెందిన శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ నిబంధ‌న‌ల ప్రకారం లేద‌ని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధ‌న‌ల ప్రకారం జ్యుడీషియల్ స్టాంప్ పేప‌ర్ వాడ‌లేద‌ని, అఫిడ‌విట్‌పై సంత‌కం చేసిన నోట‌రీ రెన్యువ‌ల్ కాలేద‌ని, నోట‌రీగా సంత‌కం చేసిన తుల‌సిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసింద‌ని టీడీపీ లీగ‌ల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో త‌న నామినేష‌న్‌పై వ‌చ్చిన అభ్యంత‌రాల మీద‌ రెండు గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహ‌న్ రెడ్డిని ఈసీ ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ పై వైసీపీ నేత‌లు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌లేద‌ని, తన నామినేషన్ తోపాటు ఆయన పోందుపర్చిన ఆదాయ వివ‌రాలు కూడా త‌ప్పుల త‌డ‌క‌లుగా ఉన్నాయ‌ని వైసీపీ నేత‌లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇరు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఎక్కడ వరకు వెళ్తుంది..? ఈ వ్యవహారాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎలా స్పందించనున్నారు.. ఇద్దరు నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు సమ్మతిస్తారా..? లేక ఇద్దరి నామినేషన్లు చెల్లవని చెబుతారా..? లేక ఒక్కరిపైనే చర్యలు తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణులను తీవ్రంగా సతమతం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles