TG venkatesh son bharat sensation comments టీడీపీలో కాకరేపుతున్న టీజీ వెంకటేష్ కుమారుడి వ్యాఖ్యలు

Tg venkatesh son bharat sensation comments

TG Venkatesh, tg venkatesh son, bharat, bharat sensational comments, kurnool assembly segment, kurnool elections, 2019 elections, sv mohan reddy, TDP, nandhyal by-poll, bhuma nagireddy, bhuma bramhananda reddy, shilpa mohan reddy, TDP, jagan mohan reddy, chandrababu, politics

TDP MP TG Venkatesh son bharat made sensational comments on 2019 elections, which triggered party leaders and sitting mla sv mohan reddy, who also made counter comments

అధికారపార్టీలో కాకరేపుతున్న భరత్ వ్యాఖ్యలు

Posted: 08/07/2017 05:23 PM IST
Tg venkatesh son bharat sensation comments

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు, యువ నేత భరత్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యూత్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యాలు సొంతపార్టీలోనే కాకరేపుతున్నాయి. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని ఆయన తనకు తానుగానే ప్రకటించుకున్నారు. భరత్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతుంది. ఓ వైపు కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో.. పార్టీ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతుంది.

కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే.. అందులోనూ  అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడ్ని కాదని భరత్ కు టిక్కెట్ ఇస్తారా..? అంటే పార్టీలో సీనియర్లకు రిక్తహస్తాలను అందిస్తారా..? లేక మోహన్ రెడ్డికి పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమౌతున్నాయి. ఈ నేపథ్యంలో భరత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కర్నూలు అభ్యర్థిని తానేనని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో భరత్ పై విరుచుకుపడిన ఆయన.. తాను టీడీపీ నుంచి అభ్యర్థిగా వుంటాను.. మరి భరత్ ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికలలో కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి.. వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి.. టీడీపీ నుంచి పోటీ చేసిన టీజీ వెంకటేష్ పై విజయం సాధించారు. కాగా, ఫిరాయింపులకు పాల్పడి ఎస్పీ మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వెళ్లగా, ఆ తరువాత టీజీ వెంకటేష్ ను రాజ్యసభకు టీడీపీ ఎన్నిక చేసింది. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలున్నా.. అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా భరత్ రానున్న ఎన్నికలలో కర్నూలు టిక్కెట్ తనదేనని చెప్పడంతో కర్నూలులో ఇప్పడే రాజకీయం వేడెక్కింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమని తెలుస్తుంది. దీంతో అధికారపార్టీ నేతల మధ్య అప్పుడే రాజుకుంటున్న విభేదాలను పార్టీ అధిష్ఠానం ఎలా కూల్ చేస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kurnool  2019 elections  bharat  sv mohan reddy  chandrababu  politics  

Other Articles