koena mitra compalints on sexually harassed call నటికి అగంతకుల నుంచి ఫోన్.. రాత్రికి వస్తావా...?

Bollywood actress and model koena mitra sexually harassed

Mumbai, Koena Mitra, sexually harassement, actress, model, unknown phone calls, bollywood, crime

bollywood actress and model koena mitra sexually harassed by unknown miscreant, which made her to approch police in mumbai

నటికి అగంతకుల నుంచి ఫోన్.. రాత్రికి వస్తావా...?

Posted: 08/01/2017 12:01 PM IST
Bollywood actress and model koena mitra sexually harassed

సంఘంలో పరపతి, సెలబ్రిటీ స్టేటస్ వున్న మహిళలకు కూడా ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు అధికమయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ కొయినా మిత్రాకు కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు గురయ్యారు. అగంతకుడు అతి నీచంగా మాట్లాడుతూ.. కాల్ గళ్ తో వ్యవహరించిన రీతిలో అమెతో సంభాషించడంతో అమె గుర్తుతెలియని అగంతకుడిపై పోలీసులను అశ్రయించింది. తనకు ఒక అగంతకుడు చేసిన ఫోన్ చేసి అసభ్యపదజాలంతో లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వారం రోజుల వ్యవధిలో ఏకంగా నలభై నుంచి యాభై సార్లు తనకు గుర్తుతెలియని అగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తన పిర్యాదులో పేర్కోనింది. అయితే ముందుగా వాటిని పట్టించుకోని తాను.. ఎవరైనా తన మిత్రులే ఫోన్ చేసి వుంటారని భావించి చివరగా శనివారం రోజు సాయంత్రం ఫోన్ లిప్ట్ చేసి అన్సార్ చేశానని, అయితే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న అగంతకుడు.. తన పట్ల అమర్యాదతో వ్యవహరించాడని, అసభహ్యపదజాలంతో.. రాత్రికి వస్తావా..? అంటూ అడిగి.. లైంగికంగా వేధింపులకు గురి చేసేలా మాట్లాడాడని తన పిర్యాదులో పేర్కోనింది.

ఈ కాల్స్‌తో విసిగి వేసారిపోయిన కొయినా మిత్ర చివరకు చేసేది లేక ముంబైలోని ఒషివరా పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. అగంతకుడ్ని నెంబర్ ట్రేసి చేసి వాడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. తన పట్ల మాత్రమే కాకుండా అనేక మహిళల పట్ల అగంతకులు ఇలానే దారుణంగా వ్యవహరిస్తున్నారని అందుకనే.. అగంతకుడికి బుద్దిచెప్పాలని కొయినా మిత్రా పోలీసులను కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Koena Mitra  sexually harassement  actress  model  unknown phone calls  bollywood  crime  

Other Articles