బ్యాంక్ సర్వీస్ నచ్చట్లేదా.. అయితే ఇలా చెయొచ్చు | Switch Banks without Changing Account Number

Rbi asks banks to enable account number portability

Account Number Portability, without Changing Account Number, RBI AC Portability, One Number Another Account, Banking Services, Poor Banking Services, SS Mundra Retire, RBI Customer Services

Account Number Portability Coming Soon. RBI Deputy Governor SS Mundra asks Banks to look into this service. You could soon switch to another bank without changing your account number.

అకౌంట్ నంబర్ ఒక్కటే కానీ...

Posted: 08/01/2017 12:12 PM IST
Rbi asks banks to enable account number portability

బ్యాంకింగ్ సేవలు పోను.. పోను... కఠినతరం అవుతున్న నేపథ్యంలో కస్టమర్లకు వెసులుబాటు కల్పించేలా కొత్త నిర్ణయం వెలువడబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. సురేష్ కు ఓ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది. అయితే అతనికి ఆ బ్యాంక్ వాళ్లు అందించే సేవలు అస్సలు నచ్చటం లేదు. దీంతో మరో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయాన్ని కొత్త బ్యాంకులో తెలియజేశాడు. అయితే పాత అకౌంట్ నంబర్ మీదే తమ దగ్గర కొత్త అకౌంట్ ఓపెన్ చేయొచ్చని చెప్పటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

త్వరలో ఈ సౌకర్యం నిజంగానే అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రానుంది. మొబైల్ నంబ‌ర్ పోర్ట‌బిలిటీ(ఫోన్ సర్వీస్ నచ్చకపోతే మరోదానికి మారిపోవటం)ని పోలి ఉన్న ఈ సర్వీసులపై దృష్టిసారించాలని రిజ‌ర్వ్ బ్యాంక్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ఎస్ఎస్ ముంద్రా అన్ని బ్యాంకుల‌ను ఆదేశించినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రచురించింది. ఆర్థిక రంగంలో పోటీత‌త్వం పెంచి, వినియోగ‌దారుల‌కు మేలైన సేవ‌లు అందించే ఉద్దేశంతోనే ఈ పోర్ట‌బిలిటీ విధానాన్ని అమలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.

ఈ నిర్ణయం వల్ల వినియోగ‌దారుల‌కు మంచి సేవ‌లందించే బ్యాంకుల్లో అకౌంట్ల సంఖ్య పెరిగటంతోపాటు, కస్టమర్లు పోతారన్న భయంతో మిగతా బ్యాంకులు జాగ్రత్తగా తమ సేవలు అందించే అవ‌కాశం ఉంటుంది. బ్యాంక్ అంబుడ్స్‌మ‌న్ వార్షిక స‌ద‌స్సులో ఈ విషయమై ఇప్పటికే బ్యాంకు ప్రతినిధులతో ఆర్బీఐ చర్చించి, ఆ తర్వాతే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇది గనుక అమలులోకి వస్తే బ్యాంకు సౌక‌ర్యాల‌తో సంతృప్తి చెంద‌ని వారు అదే అకౌంట్ నంబ‌ర్‌తో వేరే బ్యాంకులో లావాదేవీలు కొన‌సాగించే సౌల‌భ్యం క‌లుగుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే ఈ సౌకర్యం అమలులో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Account Number Portability  SS Mundra  

Other Articles