Ram Nath Kovind sworn-in as India's 14th President భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం

Ram nath kovind sworn in as india s 14th president

14th President of India,BJP,Chief Justice of India,Hamid Ansari,India,JS Khehar,Lok Sabha,Meira Kumar,NDA,oath ceremony,Politics,Pranab Mukherjee,President of India,President of India 2017,Prime Minister Narendra Modi,Ram Nath Kovind,Rashtrapati Bhavan

Mr. Kovind is the second Dalit President of India after late President K.R. Narayanan but, more significantly, the first from politically significant Uttar Pradesh and the first person from the BJP to hold the office of President since Independence.

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం

Posted: 07/25/2017 12:36 PM IST
Ram nath kovind sworn in as india s 14th president

దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎన్ ఖేహర్ కోవింద్ చేత రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ హాయంలో ఆర్ నారాయణన్ తరువాత.. మళ్లీ అత్యున్నత పదవికి ఎన్డీఏ హయాంలో మరో దళిత వర్గానికి చెందని నేత ఎన్నుకోబడ్డారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్‌ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. వేదికపై మరో వైపున ఉప రాష్ట్రపతి హమీద్ అన్సరీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అసీనులైవున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ చేసిన తొలి ప్రసంగం అహుతులను అకట్టుకుంది. దేశ రాష్ట్రపతిగా పూర్తి గౌరవంతో తాను స్వీకరిస్తున్నాని చెప్పారు. తాను ఓ మారుమూల గ్రామంలో ఓ మట్టి ఇంట్లో జన్మించానని చెప్పారు. రాష్ట్రపతి హోదాకు గౌరవాన్ని తీసుకువచ్చిన మహనీయుల అడుగుజాడల్లోనే తానూ నడుస్తానని చెప్పారు. తనపై దేశ ప్రజలు వుంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు.

అనేక బాషలు, విభిన్న సంస్కృతుల సమ్మెళమైన మన దేశం భిన్నత్వంలో ఏకత్వాని చాటుతుందని అన్నారు. అందుకే యావత్ ప్రపంచాన్ని భారత సంస్కృతి సంప్రదాయాలు అకట్టుకుంటున్నాయని అన్నారు. దేశంగా మనం ఎన్నో మైలురాళ్లను అధిగమించామని చెప్పిన రాష్ట్రపతి.. అదే ఐక్యత, అదే పట్టుదలతో మరెన్నీ లక్ష్యాలను కూడా అధిగమించాలని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛా, సోదరబావం భారత్ సొంతమని చెప్పారు. అయితే సమానత్వం, అర్థిక లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.

దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్న సైనికులు, పోలీసుల త్యాగం మరువలేనిదని అన్నారు. అదివాసీలు, రైతులు మొదలుకుని దేశం అభివృద్దిలో పాలుపంచుకుంటూ అహర్నిశలు కష్టపడుతున్న ప్రతీ ఒక్కరూ నిజమైన జాతి నిర్మాతలేనని అన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా సేవలందించానని చెప్పారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాలులో వున్న ప్రముఖల వద్దకు చేరుకుని వారి అభినందనలు అందుకుని మర్యాదపూర్వక వందనాలు చేశారు.

రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవె గౌడ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపి అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు, పలు పార్టీల అధినేతలు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత రాజాజీ మార్గ్ లోని ఆయన నూతన నివాసానికి చేరుకున్నారు.

అంతకుముందు ఇవాళ ఉదయం రామ్ నాథ్ కోవింద్ రాజ్ ఘాట్ లోని మహత్మా గాంధీ సమాధి వద్దకు చేరకుని జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీతో కలసి పార్లమెంట్ భవనానాకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి కోవింద్ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram nath kovind  pranab mukherjee  PM Modi  JS Khehar  parliament central hall  meira kumar  

Other Articles