raghunandhan gives counter to nayini తెలంగాణ హోం మంత్రి నాయినికి ఘాటు కౌంటర్

Raghunandhan rao slams telangana home minister nayini narsimha reddy

bjp leader raghunandhan rao, raghunandhan rao, ragahunandhan attacks nayini narasimha reddy, telangana home minister nayini narasimha reddy, raghunandhan rao, home minister, nayini narsimha reddy, telangana, KCR, politics

former Trs and present BJP leader Raghunandhan rao gives counter attack to talangana home minister nayini narasimha reddy on consuming drugs.

తెలంగాణ హోం మంత్రి నాయినికి ఘాటు కౌంటర్

Posted: 07/25/2017 01:25 PM IST
Raghunandhan rao slams telangana home minister nayini narsimha reddy

తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి తప్పుదారిన అన్న మాటలకు ఘాటు కౌంటర్ వచ్చింది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ లకు పబ్ లకు వెళ్లే అలవాటు ఉందంటూ ఆయన చేసిన వ్యాఖలు రాష్ట్ర రాజకీయాలో్ చర్చనీయాంశంగా మారాయి. హోం మంత్రి హోదాలో నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపి నేత రఘునందన్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పబ్ లను పెంచి పోషిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. పలు రాష్ట్రాల్లో ధరఖాస్తు చేసుకున్నా ప్లేబాయ్ పబ్ కు అనుమతి లభించలేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో ధరఖాస్తు చేసుకోవడమే అలస్యమని భావించిన ప్రభుత్వ అనుమతులు మాంజూరు చేసిందన్నారు.

ఇటీవలే మంత్రి కేటీఆరే స్వయంగా ప్లేబాయ్ పబ్ ను ప్రారంభించారని కూడా చెప్పారు. తన జీవితంలో కనీసం ఆల్కహాల్ ఎన్నడూ ముట్టలేదని, దిగజారుడు వ్యాఖ్యలకు నాయిని స్వస్తి చెప్పాలని రఘునందన్ ఈ సందర్భంగా హితవు పలికారు. పబ్ లు, క్లబ్ లకు తాను వెళ్లనని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. అంతటితో అగని రఘునందన్ రావు.. తన రక్తనమూనాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి, సీఎం కేసీఆర్, మంత్రులు ఇందుకు సిద్ధమేనా? అని నాయిని నర్సింహారెడ్డిని సూటిగా ప్రశ్నించడమే కాదు, సవాల్ విసురుతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghunandhan rao  home minister  nayini narsimha reddy  telangana  KCR  politics  

Other Articles