Woman divorces husband over ignored text messages ఓరి దీని యేషాలు.. లిన్ గురించి అనక తప్పదు..

Judge grants woman divorce after her husband ignores her text messages

smart phones, iphone, marriage, divorce, court grants divorvce to woman, woman granted divorce, defendant, plaintiff, couple divroce, text message, message, wife husband, line, divorce, taiwan, lin, kio judge

The defendant (husband) did not inquire about the plaintiff (wife), and the information sent by the plaintiff was read but not replied to. The couple's marriage is beyond repair stated the judge.

ఓరి దీని యేషాలు.. లిన్ గురించి అనక తప్పదు..

Posted: 07/21/2017 06:20 PM IST
Judge grants woman divorce after her husband ignores her text messages

భర్త వేధింపులు తాళలేక, లేక అత్తవారింట గృహహింసకు గురై.. లేక వరకట్న డిమాండ్ల నేపథ్యంలో సాధరణంగా భార్యలు భర్తల నుంచి విడాకులు కావాలంటూ న్యాయస్థానాలను అశ్రయిస్తారు. లేదా తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడనో, లేక మొగుడు మగాడు కాదనో ఇలా బలమైన కారణాలు వుంటే తప్ప వారి మధ్య మనస్పర్థలు తలెత్తి.. విడాకుల కోసం భార్యతలు డిమాండ్ చేయడంలో న్యాయముంది. కానీ . తాన పంపిన మెసేజ్ ను చూసి కూడా స్పందించకుండా వదిలేసిన భర్త నుంచి విడాకులు కావాలని డిమాండ్ చేసింది ఓ భార్య. తన మేసేజ్ రిప్లై ఇవ్వలేదంటే.. తనపై ప్రేమ లేకనే అన్న కోణంలో అటోచించిన భార్య విడాకులు కోసం న్యాయస్థానాన్ని అశ్రయించింది. అయితే కోర్టు కూడా అమె వాదనను బలపరుస్తూ అమెకు విడాకులను మంజూరు చేయడం ప్రపంచ వ్యాప్త జంటలను విస్తుగొలుపుతుంది. వివరాలోకి వెళితే..

తైవాన్‌కి చెందిన లిన్‌ అనే మహిళ తన భర్త తాను చేసిన మెసెజ్ లకు రిప్లై ఇవ్వట్లేదని.. తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని చెబుతూ కోర్టులో ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లిన్ గత ఆరు నెలల్లో పలుమార్లు తన భర్తకు లైన్ అనే మెసెజింగ్‌ యాప్ ద్వారా మెసేజ్ లు పంపింది. అయితే వాటిని చూసినప్పటికీ ఆమె భర్త బదులు ఇవ్వలేదు. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్నా కొన్నాళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అంతెందుకు ఒకసారి లిన్ కారు ప్రమాదానికి గురైన సమయంలో మెసేజ్ పెట్టినా.. చూసి కూడా రిప్లై ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలా మెసేజ్ లకు బదులు ఇవ్వకుండా తనను తన భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె కోర్టులో ఆరోపించింది. తన భర్త మెసేజ్ లకు బదులు ఇవ్వకపోగా.. తన తల్లిదండ్రులకు.. సోదరీమణులకు సేవలు చేయాలని ఆర్డర్‌ వేస్తున్నాడట. అంతేకాకుండా వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని తన గోడును కోర్టులో వెల్లబుచ్చింది. అంతా విన్న న్యాయమూర్తి లిన్‌ చేసిన మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం బట్టి ఆమె భర్త తనపై నిర్లక్ష్యంగా ఉన్నాడని భావించారు. దీంతో వెంటనే వారికి విడాకులు మంజూరు చేసేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : text message  message  wife  husband  line  divorce  taiwan  lin  kio judge  

Other Articles