undavalli arun kimar slams AP goverment on pattiseema project డబ్బు తోడేస్తున్నారంటూ.. పదను పెంచిన ఉండవల్లి..

Undavalli arun kimar slams ap goverment on pattiseema project

undavalli arun kimar slams AP goverment, undavalli arun kimar on pattiseema project, pattiseem lift irrigation, undavalli arun kimar, AP goverment, pattiseema project, lift irrigation, chandrababu, politics

former mp undavalli arun kimar slams AP goverment, says he was questioning the government on various issues since two years but none responded till now from ruling side.

డబ్బు తోడేస్తున్నారంటూ.. పదను పెంచిన ఉండవల్లి..

Posted: 07/21/2017 04:38 PM IST
Undavalli arun kimar slams ap goverment on pattiseema project

రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు పట్టిసీమ ప్రాజెక్టుపై మళ్లీ పదను పెంచాడు. పట్టిసీమతో స్థానిక రైతాంగానికి లబ్ది చేకూరిందని.. ప్రకాశం బ్యారేజీపై టీడీపీ నేత గొరంట్ల బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చకు సిద్దమైన సందర్భంగా అంగీకరించిన ఆయన మరింతగా ఆ ప్రాజెక్టుపై అథ్యయనం చేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన మాటల పదనును పెంచాడు. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నట్ల వట్టిసీమ అసలు నీళ్లు తోడే ప్రాజెక్టే కాదని స్సష్టం చేశారు. వట్టిసీమ పేరుతో ప్రభుత్వం డబ్బులు తోడేస్తుందని ఉండవల్లి అరోపించారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉండవల్లి తాను గత రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, అయితే ఇప్పటి వరకు ఒక్కదానిపైన కూడా సమాధానం రాలేదని, సంబంధిత మంత్రులు, అధికారుల నుంచే కాదు కనీసం ఆయా కార్యాలయాల అటెండర్ల నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు. ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు కాగ్‌ నివేదికే సరైన ఆయుధమన్నారు. కాగ్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని వెల్లడించారు. వైఎస్ హాయంలో చేపట్టినన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని అన్నారు.

‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ ఎవరన్న అంశంపై కూడా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనికి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చకు సవాల్ ను కూడా స్వీకరించిన ఉండవల్లిని పోలీసు అనుమతి లేదన్న కారణంగా అరెస్టు చేసి వెనక్కు పంపించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : undavalli arun kimar  AP goverment  pattiseema project  lift irrigation  chandrababu  politics  

Other Articles