Presidential Election Valid Votes with Special Pen Only

Special pen from mysuru to be used for president polls

Presidential Poll, Presidential Election, Presidential Elections, Meira Kumar Presidential Elections, Meira Kumar Ramnath Kovind, Presidential Poll Violent Pen, Presidential Poll 2017, Indian 14th President Election

Presidential poll in India. MPs, MLAs can't use own pens to vote, says Election Commission. 784 MPs, 4114 MLAs will vote to elect 14th President.

రాష్ట్రపతి ఎన్నిక.. ఆ ఓట్లు చెల్లవంట!

Posted: 07/17/2017 08:13 AM IST
Special pen from mysuru to be used for president polls

మరి కాసేపట్లో దేశ ప్రథమ పౌరుడికి సంబంధించిన ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న రాష్ట్రపతి పోలింగ్ లో మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నిబంధనల ప్రకారం ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే సహేతుకమైన కారణం ఉంటే ఎంపీలు పార్లమెంటులో కాకుండా వారి సొంత రాష్ట్రాల్లోని అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించబోతున్నారు.

ఇక ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. గతంలోలా కాకుండా ఈసారి ఎన్నికల ఓటింగ్ కోసం సరికొత్త పెన్నులు, వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగించబోతున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగులో ఉండే బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. గతేడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో సిరా (ఇంకు) విషయంలో వివాదం తలెత్తింది. ఈ కారణంగా ఈసారి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక పెన్నులను సిద్ధం చేశారు. ఈ పెన్నుల్లోని సిరా ఊదా రంగులో ఉంటుంది.

ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పెన్నులు తీసుకుని ఈ కొత్త పెన్నులను వారికి అందిస్తారు. ఓటు వేశాక మళ్లీ వాటిని తీసుకుంటారు. అలా అయితేనే వాళ్ల ఓట్లు చెల్లుతాయ్.. లేదంటే చెల్లవు. ఇక ఓటింగ్ గది లోపల ఓటర్లు ఎలా వ్యవహరించాలన్న సూచనలను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ ప్రదర్శించనుంది. ఇలా చేయడం దేశంలో ఇదే తొలిసారి!

ప్రస్తుత ఎన్నికల్లో 55 మంది ఎంపీల్లో ఈ వెసులుబాటును ఉపయోగించుకుని తమ సొంత రాష్ట్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న ఎంపీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పారికర్ తదితరులు ఉన్నారు. అలాగే ఐదుగురు శాసనసభ్యులు పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతి తీసుకున్నారు.

ఈనెల 20న ఓట్లను లెక్కిస్తారు. ఎన్డీఏ పక్షాల తరపున రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ పక్షాల తరపున మీరా కుమార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలకు మరో విశిష్టత ఏంటంటే... సాధారణంగా ఆ బాధ్యతను రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహించేవారు. కానీ, ఈ దఫా మాత్రం లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Presidential Elections  India  Ramnath Kovind  Meira Kumar  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno